బుల్లితెర నటి ఆత్మహత్య కేసులో ట్విస్ట్

Update: 2023-05-30 20:44 GMT
ఆత్మహత్యకు పాల్పడిన బుల్లితెర నటి ఆకాంక్ష దూబే కేసు కొత్త మలుపు తిరిగింది. పోలీసుల దర్యాప్తులో షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆత్మహత్య సమయంలో ఆమె ఒంటి మీద ఉన్న దుస్తుల మీద స్పెర్మ్‌ ను పోలీసులు కనుగొన్నారు. దీంతో ఈ స్మెర్మ్‌ ఎవరిదనే విషయం తెలుసుకునేందుకు  డిఎన్‌ఏ టెస్టుకు ప్రయత్నిస్తున్నారు. ఇందు కోసం కోర్టును ఆశ్రయించనున్నారు. దూబే ఆత్మహత్యకు పాల్పడిందా లేక హత్య అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
       
బుల్లితెర నటి ఆకాంక్ష దూబే గత మార్చి 25న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌ లోని వారణాసిలో ఓ హోటల్‌ గదిలో ఆమె మృతదేహం కనిపించింది. దూబే ప్రియుడు, గాయకుడు అయిన సమర్‌ సింగ్‌ పై అనుమానం వ్యక్తం చేసిన ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అమర్‌సింగ్‌ను, అతని సోదరుడు సంజయ్‌ ని పోలీసులు అరెస్టు చేశారు.

దర్యాప్తులో పోలీసులు సంచలన విషయాలు కనుగొంటున్నారు. తాజాగా పోలీసులకు షాకింగ్‌ విషయం తెలిసింది. ఆత్మహత్య సమయంలో ఆమె ఒంటిపై ఉన్న దుస్తులకు స్మెర్మ్‌ ఉన్నట్లు గుర్తించారు. ల్యాబ్‌ టెస్టుల కోసం దుస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు డిఎన్‌ఏ పరీక్షలు చేయించేందుకు గాను కోర్డును ఆశ్రయించనున్నారు. 25 సంవత్సరాల ఆకాంక్ష ముజ్సె షాదీ కరోగీ, వీరన్‌ కే వీర్‌, ఫైటర్‌ కింగ్‌ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

కొంతకాలంగా సహనటుడు సమర్‌ సింగ్‌ ను ఆకాంక్ష ప్రేమిస్తోంది. ఫిబ్రవరి నెలలో ఈ విషయాన్ని అధికారికంగా తెలిపిన ఆమె నెల రోజులకే ఆత్మహత్య చేసుకుంది. ఆమెది ఆత్మహత్య కాదని, మర్డర్‌ అని ఆమె అభిమానులు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. మానసిక వేదనకు గురి చేసి ఆత్మహత్యకు ప్రేరేపించారన్నది మరికొందరి వాదన. ఈ క్రమంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్‌ లో దుస్తులపై స్పెర్మ్‌ మరకలు కనుగొనడంతో అభిమానుల అనుమానాలకు బలం చేకూరుస్తోంది.

Similar News