స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలు: అచ్చెన్నాయుడు క్షమాపణలు

Update: 2021-09-14 13:13 GMT
జూలైలో రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్‌పై చేసిన వ్యాఖ్యలపై సీనియర్ శాసనసభ్యుడు, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ యూనిట్ అధ్యక్షుడు కె. అచ్చన్నాయుడు మంగళవారం విచారం వ్యక్తం చేశారు. అచ్చెన్న గత నెలలో తనకు జారీ చేసిన సమన్ల ప్రకారం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరయ్యారు.  స్పీకర్‌పై చేసిన ఆరోపణలకు సంబంధించి ఆయన ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందనందున కమిటీ అతడిని వ్యక్తిగతంగా హాజరుకావాలని కోరింది. "అచ్చెన్నాయుడు ఇచ్చిన రాతపూర్వక వివరణ సంతృప్తికరంగా లేనందున,  వ్యక్తిగతంగా హాజరుకావాలని కమిటీ ఆదేశించింది" అని గోవర్ధన్ రెడ్డి చెప్పారు.

అచ్చెన్నాయుడు  తాను చేసిన వ్యాఖ్యలపై కమిటీకి సుదీర్ఘమైన వివరణను ఇచ్చినట్లు తెలిసింది. తన ఆరోపణలతో కూడిన ప్రెస్ నోట్‌ను తన సంతకం లేకుండానే అనుకోకుండా మీడియాకు విడుదల చేసినట్లు ఆయన కమిటీకి చెప్పారు. స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలకు ఆయన అధికారికంగా క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు.

అచ్చెన్నాయుడు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారని, అనుకోకుండా తన ప్రెస్ నోట్ బయటకు వచ్చిందని గోవర్ధన్ రెడ్డి మీడియాతో అన్నారు. అచ్చెన్నాయుడు స్టేట్‌మెంట్‌ను త్వరలో కమిటీ సభ్యులకు పంపుతామని కాకాని చెప్పారు. "కమిటీ సభ్యులందరి అభిప్రాయాల ఆధారంగా నిర్ణయం తీసుకోబడుతుంది" అని ఆయన చెప్పారు.

మరొక టిడిపి నాయకుడు కూన రవికుమార్ కూడా  స్పీకర్‌పై వ్యాఖ్యలు చేసినప్పటికీ, కమిటీని కలవడానికి అందుబాటులో లేరు. కమిటీ ముందు హాజరయ్యేందుకు మరొక అవకాశం ఇవ్వనున్నట్టు తెలిపారు.

సెప్టెంబర్ 21న జరిగే సమావేశంలో ప్రివిలేజ్ నోటీసులు అందుకున్న రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్, టిడిపి శాసనసభ్యుడు నిమ్మల రామానాయుడుపై కూడా నిర్ణయం తీసుకోబడుతుందని తెలిపారు.
Tags:    

Similar News