తృటి లో ప్రమాదాన్ని తప్పించుకున్న లోకేశ్

Update: 2019-12-11 05:27 GMT
టీడీపీ అధినేత చంద్రబాబు కు కుమారుడు కమ్ ఎమ్మెల్సీ నారా లోకేశ్ కు ప్రమాదం తృటిలో తప్పింది. ఈ ఉదయం (బుధవారం) చోటు చేసుకున్న ఈ ఘటన తో లోకేశ్ తో ఉన్న భద్రతా సిబ్బంది.. పార్టీ నేతలు ఉలిక్కిపడిన పరిస్థితి. ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీల్ని పెంచటాన్ని నిరసిస్తూ మంగళగిరి లో నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి హాజరయ్యేందుకు నారా లోకేశ్ బస్సు లో వచ్చారు.


ఈ నిరసన కార్యక్రమాన్ని షూట్ చేసేందుకు సాధారణ కెమేరాల తో పాటు డ్రోన్ కెమేరాల్ని కూడా వినియోగిస్తున్నారు. అయితే.. ఆపరేటింగ్ లోపం కారణంగా డ్రోన్ కూలి కిందకు పడి పోయింది. లోకేశ్ బస్సు దిగుతున్న సమయం లోనే డ్రోన్ కింద పడి పోవటంతో ప్రమాదం నుంచి తృటి లో తప్పించుకున్నట్లైంది. దీంతో అక్కడి వారంతా ఒక్కసారి షాకయ్యారు. ఒకడుగు ముందుకు పడినా.. లోకేశ్ మీద డ్రోన్ పడేది.


ఇదిలా ఉంటే.. డ్రోన్ కిందకు పడి పోవటానికి కారణం.. విద్యుత్ తీగలు తగటంతో అది కాస్తా కింద పడింది. ప్రముఖలు నిర్వహించే కార్యక్రమాల్లో డ్రోన్ల వినియోగం లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు. డ్రోన్ల వినియోగం మీద పరిమితులు విధించే అంశాన్ని సమీక్షించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News