పాజిటివ్ తేల్చేందుకు అమెరికాలో సరికొత్త కిట్
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను నిర్దారించేందుకు వీలుగా ఇప్పటికే పలు పరీక్షలు అందుబాటులో ఉండటం తెలిసిందే. అయితే.. ఈ అన్ని పరీక్షల్లోనూ లెక్క తేల్చేందుకు చిన్నపాటి యంత్రాలు అవసరం ఉంటుంది. అందుకు భిన్నంగా.. ఎలాంటి యంత్రాల అవసరం లేకుండా.. కరోనా ఉందా? లేదా? అన్న విషయాన్ని తేల్చేసేందుకు వీలుగా అమెరికాలోని ఒక కొత్త కిట్ అందుబాటులోకి వచ్చేసింది.
అబాట్ సంస్థ రూపొందించిన ఈ కొత్త కిట్ కు అమెరికా ఆహార.. ఔషధ నియంత్రణ సంస్థ తాజాగా ఓకే చెప్పేసింది. ఈ కొత్త కిట్ తో పరీక్షను పదిహేను నిమిషాల్లో పూర్తి అయ్యేలా దీన్ని రూపొందించారు. మిగిలిన పరీక్షా విధానానికి ఇది భిన్నమైనదని చెబుతున్నారు. చిన్నసైజు క్రెడిట్ కార్డు పరిమాణంలో ఉండే ఈ కిట్ ధర ఐదు డాలర్లుగా డిసైడ్ చేశారు.
అయితే.. ఈ కిట్ ను ఇంట్లో ఎవరికి వారు వాడకూడదని.. నిపుణుల వద్దే దీన్ని నిర్దారించుకోవాలని చెబుతున్నారు. ఎందుకంటే.. అబాట్ సంస్థ రూపొందించిన కిట్ ను.. ముక్కు నుంచి సేకరించే నమూనాలతోనే పరీక్ష జరపాల్సి ఉంటుంది. ఈ కారణంతోనే నిపుణుల వద్దే పరీక్ష జరపాలంటున్నారు. ఈ కొత్త కిట్ భారత్ లాంటి దేశాలకు వస్తే.. భారీ ఆదాతో పాటు.. మరింత ఎక్కువగా పరీక్షలు జరిపే వీలవుతుందని చెప్పక తప్పదు.
అబాట్ సంస్థ రూపొందించిన ఈ కొత్త కిట్ కు అమెరికా ఆహార.. ఔషధ నియంత్రణ సంస్థ తాజాగా ఓకే చెప్పేసింది. ఈ కొత్త కిట్ తో పరీక్షను పదిహేను నిమిషాల్లో పూర్తి అయ్యేలా దీన్ని రూపొందించారు. మిగిలిన పరీక్షా విధానానికి ఇది భిన్నమైనదని చెబుతున్నారు. చిన్నసైజు క్రెడిట్ కార్డు పరిమాణంలో ఉండే ఈ కిట్ ధర ఐదు డాలర్లుగా డిసైడ్ చేశారు.
పరీక్షల్ని పెద్ద ఎత్తున పెంచటానికి ఈ కొత్త కిట్ తో చాలా తేలికని చెబుతున్నారు. అంతేకాదు.. చాలా తక్కువ ధర కూడా కావటంతో.. ఎక్కువమంది వినియోగించే వీలుంటుందని చెబుతున్నారు. అమెరికా మార్కెట్లోకి వస్తున్న అత్యంత చౌకైన కరోనా నిర్దారణ పరీక్షా కిట్ గా దీన్ని అభివర్ణిస్తున్నారు.