కారులో కొకైన్ తో పట్టుబడిన బీజేపీ యువ మహిళ నేత పమేలా

Update: 2021-02-21 03:30 GMT
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మహిళ నేత ఒకరు కొకైన్ తరలిస్తూ పట్టుబడడం కలకలం రేపింది. బీజేపీ యువ మహిళా నేతను కోల్ కతా పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన ఈ నేత కారులో 100 గ్రాముల కొకైన్ తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు.ఈమెతోపాటు  బీజేపీకి చెందిన మరో నేత ప్రోబిర్ కుమార్ డే ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన బీజేపీ యువనేతను పమేలా గోస్వామిగా పోలీసులు గుర్తించారు.

పమేలాను తెల్లవారుజామున న్యూ అలీపోర్ ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువ మోర్చాలో ఆమె స్నేహితుడు మరియు సహోద్యోగి - ప్రబీర్ కుమార్ డే కూడా అదే కారులో ఉండటంతో అరెస్టు చేశారు. బెంగాల్ బిజెపి ప్రధాన కార్యదర్శి పమేలా గోస్వామిని అరెస్ట్ చేసిన పోలీసులు, ఆమె పర్సులో దొరికిన కొన్ని లక్షల విలువైన కొకైన్ ను , అలాగే ఆమె ఉన్న కారు సీటు కింద ఉన్న కొకైన్ పొట్లాలను స్వాధీనం చేసుకున్నారు.

పమేలా ఒక కేఫ్ కు పదేపదే వెళ్లడం.. మోటార్ సైకిళ్లపై వస్తున్న యువకులతో లావాదేవీలు జరపడం.. అనుమానాస్పదంగా వ్యవహరించడంతోనే చెక్ చేశామని.. ఆమె వద్ద కొకైన్ దొరికిందని పోలీసులు తెలిపారు.అయితే బెంగాల్ ప్రభుత్వం బీజేపీ నేతలను కావాలనే టార్గెట్ చేసి పోలీసుల చేతనే ఈ కొకైన్ పెట్టించి అరెస్ట్ చేసిందిన బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
Tags:    

Similar News