అనుమానాస్పద స్థితిలో ఆస్ట్రేలియాలో తెలుగు వాసి మృతి..రెండేళ్ల క్రితమే వివాహం!
ఆస్ట్రేలియాలో ఓ తెలుగు యువకుడు అనుమానాస్పద స్థితిలో మరణించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా కొరిశెపాడు మండలం పమిడిపాడుకు చెందిన రావి హరీష్‌బాబు ఆస్ట్రేలియాలోని అడిలైట్ స్టేట్‌లోని తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతదేహాన్ని కనుగొన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హరీష్‌బాబు మృతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గత 6 సంవత్సరాలుగా హరీశ్ బాబు అడిలైడ్ ప్రాంతంలోని సల్స్ బరీలో నివసిస్తున్నాడు. హరీశ్ బాబు భార్య గర్భవతి కావడంతో కొన్నాళ్ల కిందట పుట్టింటికి వచ్చింది.
ఇక్కడే ప్రసవించిన ఆమె కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆస్ట్రేలియా వెళ్లలేకపోయింది. ఆంక్షలు సడలించడంతో ఆస్ట్రేలియా వెళ్లేందుకు ప్రయత్నించిన ఆమె విమానం ఎక్కేందుకు చెన్నై చేరుకుంది. అయితే ఆస్ట్రేలియాలో ఉన్న భర్తకు ఫోన్ చేయగా, అతడు ఎంతకీ లిఫ్ట్ చేయకపోవడంతో ఆమె ఆందోళనకు గురైంది. బంధువులు హరీశ్ ఉంటున్న ప్రాంతంలోని ఇతరులకు ఫోన్ చేయడంతో అతడు తన ఫ్లాట్ లో విగతజీవుడిగా పడివున్న విషయం వెల్లడైంది. దాంతో హరీశ్ భార్య, ఇతర కుటుంబ సభ్యులు తీవ్ర విషాదానికి లోనయ్యారు. హరీశ్ బాబు తన ఫ్లాట్ లో ప్రస్తుతం ఒక్కడే ఉంటున్నాడని, మరి ఎలా మరణించాడో తెలియడంలేదని భార్య కన్నీరుమున్నీరవుతోంది.
ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తులో అసలు విషయాలు తెలుస్తాయని భావిస్తున్నారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన హరీష్ ఆస్ట్రేలియాలో వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపార లావాదేవీల కారణంగా హరీష్ ను హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సాయం చేయాలని వేడుకుంటున్నారు. వ్యాపారాల్లో ఏదో విబేధాలు ఉండడంతో దానిని సెటిల్ మెంట్ చేసుకుని, తర్వాత వేరే బిజినెస్ పెట్టుకోవాలని తన కొడుకు అనుకున్నట్లు తండ్రి రావి పూర్ణచంద్రరావు వెల్లడించారు.