కాంగ్రెస్ కు వరుస షాక్ లు.. పార్టీ కోలుకునేనా?

Update: 2021-02-22 16:30 GMT
తెలంగాణ కాంగ్రెస్ కు వరుస షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు ఇటీవల బీజేపీ గూటికి చేరగా.. తాజాగా మరో కాంగ్రెస్ ఆ పార్టీకి రాజీనామా చేశారు.కాంగ్రెస్ పార్టీకి అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి రాజీనామా చేయడం సంచలనమైంది. ఆయన తనకు ఎమ్మెల్సీ సీటును ఇవ్వనందుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా హర్షవర్ధన్ రెడ్డి పోటీచేస్తున్నారు. ఇటీవలే హర్షవర్ధన్ రెడ్డిని పీసీసీ చీఫ్ ఉత్తమ్ పిలిచి బుజ్జగించారు. అయినా వినకుండా పార్టీకి రాజీనామా చేసి బరిలో దిగుతున్నారు.

హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ స్థానానికి  చిన్నారెడ్డిని.. ఖమ్మం, వరంగల్‌, నల్లగొండ నియోజకవర్గం నుంచి రాములు నాయక్‌ను కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులుగా  ప్రకటించిన సంగతి తెలిసిందే.  హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ స్థానం నుంచి పోటీ చేయాలని హర్షవర్ధన్‌రెడ్డి అనుకున్నారు. అయితే అధిష్టానం చిన్నారెడ్డికి సీటు ఇవ్వడంతో జీర్ణించుకోలేని హర్షవర్ధన్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగుతున్నారు.  హర్షవర్ధన్‌రెడ్డి రెబెల్‌గా బరిలోకి దిగేందుకు ప్రయత్నాల్లో ఉన్నారు.
Tags:    

Similar News