దారుణం : అర్ధనగ్నంగా మహిళల ఊరేగింపు ....ఎక్కడంటే ?

Update: 2020-05-07 07:50 GMT
మంత్రగత్తెల నెపంతో ఓ ముగ్గురు మహిళలను అర్ధనగ్నంగా ఊరేగించారు. ఈ అమానవీయ సంఘటన ముజఫర్‌పూర్‌లోని దక్రామా గ్రామంలో సోమవారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే ...  ముజఫర్‌పూర్ జిల్లాలోని హతౌది పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న దక్రామా గ్రామంలో ఇటీవల ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు గ్రామంలోని ఓ చోట కొన్ని పూజ క్రతువులు నిర్వహించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు.. మంత్రాలు చేస్తున్నారన్న నెపంతో వారిని పట్టుకుని కట్టేశారు.

అనంతరం గుండు కొట్టి.. అర్ధనగ్నం మార్చి గ్రామంలో ఊరేగించారు. బలవంతంగా మూత్రం కూడా తాగించే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలామంది షాక్‌కి గురయ్యారు. పోలీసుల దృష్టికి కూడా వెళ్లడంతో గ్రామానికి వెళ్లి ఘటనపై ఆరా తీసి కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ముజఫర్‌పూర్‌ పోలీసులు తెలిపారు. మహిళలను అర్ధనగ్నంగా ఊరేగించిన దుండగులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

సోమవారం(మే 4) ఈ ఘటన జరిగింది.. ప్రధాన నిందితుడు శ్యామ్ సహానితో పాటు మరో 9 మందిని అరెస్ట్ చేశామని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు. పరారీలో ఉన్న మరో ఆరుగురు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఆధారంగానే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విచారణలో పూర్తి నిజాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నామన్నారు.

ఘటన తర్వాత బాధిత మహిళల కుటుంబం ఆ గ్రామం నుంచి వెళ్ళిపోయింది అని  పోలీసులు తెలిపారు. సబ్ డివిజనల్ ఆఫీసర్ కుందన్ కుమార్ మాట్లాడుతూ.. పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని.. నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమని అడిషనల్ సూపరింటెండ్ అమితేష్ కుమార్ స్పష్టం చేశారు.
Tags:    

Similar News