ఫేస్ బుక్ పాడు పరిచయం.. పాపను బలి తీసుకుంది!

Update: 2020-07-03 23:30 GMT
పరిచయాలకు సరికొత్త వేదికలు రావటం.. ముక్కు ముఖం తెలీని ఇద్దరు అపరిచితుల మధ్య మొదలయ్యే స్నేహం ఎక్కడికెక్కడో వెళ్లటమే కాదు.. కొన్నిసార్లు దారుణాలకు తెర తీస్తోంది. తాజాగా అలాంటిదే ఒకటి హైదరాబాద్ శివారులో చోటు చేసుకుంది. పెను సంచలనంగా మారిన ఈ ఉదంతాన్ని చూస్తే.. పాడు ఫేస్ బుక్ ఫ్రెండ్ షిప్ అనుకోకుండా ఉండలేం. ఇంతకూ ఏం జరిగిందంటే..

ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన వ్యక్తి..అనంతపురం జిల్లాకు చెందిన యువతి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తొమ్మిదేళ్ల వారి వివాహ బంధానికి గుర్తుగా ఐదేళ్ల చిన్నారి ఉంది. నాలుగు నెలల క్రితం కరుణాకర్ అనే వ్యక్తి ఫేస్ బుక్ ద్వారా యువతికి పరిచయమయ్యాడు. త్వరలోనే వారిద్దరి మధ్య దూరం తగ్గి దగ్గరయ్యారు. ఈ క్రమంలో కరుణాకరన్ తన స్నేహితుడు రాజశేఖర్ ను ఆమెకు పరిచయం చేశాడు. ఇది జరిగిన కొద్ది రోజులకే సదరు యువతి.. కరుణాకర్ తో మాట్లాడటం బంద్ చేసింది. తనఇంటికి రావొద్దని చెప్పింది.

దీనికి కారణం తాను పరిచయం చేసిన రాజశేఖర్ కారణం గానే అన్న విషయాన్ని తెలుసుకున్న కరుణాకర్ రగిలిపోయాడు. దీంతో.. వారిద్దరిని చంపేయాలని భావించాడు. అందులో భాగంగా సర్జికల్ కత్తిని తీసుకొని సదరు వివాహిత ఇంటికి వెళ్లాడు. ఇంటి తలుపు వేసి ఉంది. అదే సమయంలో ఇంట్లో రాజశేఖర్.. సదరు వివాహిత ఉన్నారు. బాత్రూం లో రాజశేఖర్ ను దాచిన యువతి.. కరుణాకర్ కుఅబద్ధం చెప్పినట్లు సమాచారం. దీంతో.. ఆగ్రహానికి గురైన కరుణాకర్ అతడ్ని బయట కు రావాలన్నాడు. ఎంతకూ బయటకు రాకపోవటంతో.. బయట ఉన్న వివాహిత కుమార్తె ను పట్టుకొని చంపుతానని బెదిరించటమే కాదు.. చిన్నారిని తనతో తెచ్చుకున్న కత్తితో గొంతు కోశాడు. దీంతో.. ఆ చిన్నారి మరణించింది.

ఈ షాకింగ్ ఘటనతో సదరు యువతి కిందకు పడిపోయింది. ఆమె అరుపులకు బాత్రూంలో ఉన్న రాజశేఖర్ బయటక వచ్చాడు. అతడి మీద కరుణాకర్ దాడి చేసే ప్రయత్నం చేయగా.. తప్పించుకున్నాడు. ఈ ఘటన అనంతరం తన రెండు చేతుల్ని.. గొంతును కరుణాకర్ కోసుకున్నాడు. ఈ అరుపులు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వటం తో.. నిందితుడ్ని.. వివాహిత ను ఆసుపత్రి కి తరలించారు. మరణించిన.. చిన్నారిని పోస్టుమార్టం కోసం ఉస్మానియా కు తరలించారు. ఈ ఉదంతం గురించి విన్న వివాహత భర్త షాక్ కు గురయ్యాడు. కరుణాకర్ తనను అన్నా అని పిలిచే వాడని.. తన భార్యను అక్కా అనే వాడని.. ఇలాంటి పని చేస్తాడని తాను అనుకో లేదని వా పోయాడు. ఈ ఉదంతం పెను సంచలనంగా మారింది. వర్చువల్ ప్రపంచంలో పరిచయాలు మంచి చేసేది కొంతైతే.. ఇలాంటి దారుణాలకు అవకాశం ఉంటుందన్నది మర్చిపోకూడదు.
Tags:    

Similar News