బెంగళూరు హైవేపై షాకింగ్ గా ఆ జంట హల్ చల్

Update: 2020-09-23 03:30 GMT
గుండెలు అదిరిపోయే వేగం.. ఏమైపోతారన్న ఆందోళన కలిగించేలా ప్రమాదకర విన్యాసాలు చేస్తూ.. ఆ రోడ్డు మీద వెళుతున్న వారికి వణుకు పుట్టించేలా చేసిందో జంట. కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు మహానగరంలోని గ్రామీణ జిల్లాలోని హైవే మీద చోటు చేసుకున్న ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.

బెంగళూరు గ్రామీణ జిల్లా కిందకు వస్తుంది దేవనహళ్లి ప్రాంతం. హైదరాబాద్ హైవే.. తమకూరు హైవేల మీద వీకెండ్ వేళ.. యూత్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ప్రమాదకరమైన హైవే వీలింగ్ చేసే అలవాటు అక్కడ ఎక్కువ. ఈ కారణంతోనే ఆ ప్రాంతంలో వీకెండ్ వస్తే చాలు.. చుట్టూ ఉన్న వారు వణుకుతుంటారు. ఎందుకంటే.. ప్రమాదకరమైన వీలింగ్ చేస్తుంటారు.

తాజాగా ఒక యువ జంట ఇదే తరహాలో వీలింగ్ చేస్తూ రచ్చ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ వైనంపై పోలీసులు ఇప్పుడు సీరియస్ గా ఉన్నారు. తమకూరు హైవేపై తాజాగా ఒక జంట డేంజరస్ వీలింగ్ చేసింది. ఈ క్రమంలో బైకు వెనుక కూర్చున్న యువతి డ్రాగర్ ను చేతిలో పట్టుకొని.. పెద్ద పెద్ద గా అరుస్తూ చేసిన హడావుడి అంతా ఇంతా కాదంటున్నారు.

వెర్రిగా కేకలు పెడుతూ.. అమితమైన వేగంతో దూసుకెళ్లిన ఈ జంటను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. వీరి చేష్టలకు హైవే మీద ఉన్న పలువురు వాహనదారులు తీవ్రమైన టెన్షన్ కు గురైనట్లుగా తెలుస్తోంది. వీరి చేష్టలకు సంబంధించి కొందరు ఫోటోలు తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Tags:    

Similar News