మా ఇడ్లీ బాలేదంటవా..! ఎన్ని గుండెలోయ్ నీకు.. ట్విట్టర్ లో మోత మోగుతోంది!
దక్షిణ భారతదేశంలో ఇడ్లీకి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు.. సాంబార్ ఇడ్లీ, చట్నీ ఇడ్లీ, నెయ్యి ఇడ్లీ, కారప్పొడి ఇడ్లీ.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ చాంతాడంత ఉంది. కొన్ని వందల రకాలు ఇడ్లీలు అందుబాటులో ఉంటాయి. ఇడ్లీ ప్రియులకు కొదవే లేదు. పొద్దునే ఇడ్లీ తినందే ఏమి తోచని వారూ ఉన్నారు. అటువంటి ఇడ్లీ గురించి పొరపాటున బ్రిటన్‌కు చెందిన ఓ చరిత్ర కారుడు, విద్యావేత్త నోరుపారేసుకున్నాడు. ‘ఇడ్లీ నాకు బోరింగ్ ’ అంటూ ట్వీట్ చేశాడు. ఇంకేముంది ఇడ్లీ ప్రియులు రెచ్చిపోయారు. అతగాడి మీద నిప్పులు చెరుగుతున్నారు. మా ఇడ్లీకి పేరు పెడతావా.. అంటూ ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. ‘ప్రపంచంలో అత్యంత అనాసక్తమైన ఆహారం ఇడ్లీ’ అంటూ ఎడ్వర్డ్ ఆండర్సన్ అనే చరిత్రకారుడు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది.
నిజానికి దక్షిణభారతదేశంలో పుట్టిన ఇడ్లీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమస్ అయ్యింది. ఇటీవలే తనకు ఇడ్లీ అంటే ఎంతో ఇష్టమని అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీచేస్తున్న కమలా హారిస్ కూడా చెప్పారు. కమలా హారిస్ తల్లి తమిళనాడుకి చెందిన వారు కాగా తండ్రి జమైకా దేశస్థులు. ‘ఇడ్లీ అనేది ఓ బోరింగ్ ఆహారపదార్థం. దీన్ని చాలామంది ఎందుకు ఇష్టపడతారో నాకు అర్థం కావడం లేదు. అంటూ ఓ ఫుడ్ డెలివరీ సంస్థ అడిగిన ప్రశ్నకు సమాధానంగా డాక్టర్ అండర్సన్ ట్వీట్ చేశారు. అండర్సన్ వ్యాఖ్యలతో ఇడ్లీ ప్రియులు తీవ్రంగా నొచ్చుకున్నట్టున్నారు. తమ ప్రాంతం మీద, సంస్కృతి మీద దాడి చేసినట్టు భావించనట్టున్నారు. ఇక ప్రముఖ కాంగ్రెస్ నేత శశి థరూర్ అయితే ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. ‘ ప్రపంచంలో కొంతమందికి ఏమీ తెలియదు. ఇడ్లీ రుచిని ప్రశంసించడానికి, క్రికెట్‌ని ఆస్వాదించటానికి, ఒట్టంతుల్లాల్ నృత్యాన్ని ని వీక్షించడానికి అదృష్టం ఉండాలి. ఇడ్లీని ఆస్వాదించలేని ఈ వ్యక్తిని చూసి జాలిపడదాం’ అంటూ ట్వీట్ చేశాడు. శశి థరూర్‌తోపాటు చాలా మంది ప్రముఖులు అండర్సన్ ట్వీట్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే 90 శాతం మంది ట్విట్టర్ యూజర్లు మాత్రం దీన్ని కామెడీగా, లైట్‌గా తీసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ గత రెండ్రోజులుగా సోషల్‌మీడియాకు ‘ఇడ్లీ’ పేరిట ఓ కొత్త వివాదం దొరికింది.