క‌రోనా అప్టేడ్: ఏపీలో మ‌రో 81 కేసులు..మొత్తం 1,097

Update: 2020-04-26 07:07 GMT
క‌రోనా వైర‌స్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నియంత్ర‌ణ‌లోకి రావ‌డం లేదు. రోజురోజుకు ఆ వైర‌స్ కేసులు పెరుగుతున్నాయి. నిన్న క‌రోనా కేసులు వెయ్యి దాట‌గా తాజాగా మ‌రికొన్ని కేసులు న‌మోదయ్యాయి. శ‌నివారం నుంచి ఆదివారం ఉద‌యం వ‌ర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 81 పాజిటివ్ కేసులు వ‌చ్చాయి. వీటితో క‌లిపి ఏపీలో మొత్తం కేసులు 1,097కు చేరాయని వైద్యారోగ్య శాఖ ప్ర‌క‌టించింది. అయితే క‌రోనా నుంచి చికిత్స పొంది తాజాగా కోలుకున్న 60మంది ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జ‌య్యారు. వీరితో కోలుకున్న వారి సంఖ్య 231మంది. ప్ర‌స్తుతం 835మంది క‌రోనా వైర‌స్ బారిన ప‌డిన ఆస్ప‌త్రుల్లో చికిత్స పొంద‌తున్నారు. వైర‌స్ బారిన మృతి చెందిన వారు 31మంది ఉన్నారు.

తాజాగా న‌మోదైన కేసుల్లో అత్య‌ధికంగా కృష్ణాజిల్లాలో 52 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి. ఇక‌ ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో 12 - క‌ర్నూలులో 4 - వైఎస్సార్ క‌డ‌ప‌లో 3 - గుంటూరులో 3 - తూర్పుగోదావ‌రిలో 2 - అనంత‌పురములో 2 చొప్పున కేసులు న‌మోదయ్యాయి. అయితే క‌రోనా కేసు ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క‌టి కూడా న‌మోదు కాని జిల్లా విజ‌య‌నగ‌రం. నిన్న‌నే శ్రీకాకుళం జిల్లాలో మూడు కేసులు న‌మోదు కావ‌డంతో ఆ జిల్లా అధికార యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మై నివార‌ణ చర్య‌లు చేప‌ట్టింది.


Tags:    

Similar News