సై సై... చైనాతో సరిహద్దు విషయంలో భారత్ సంచలన నిర్ణయం!
ఏ విధంగా చూసినా భారత్ కు ప్రధాన శత్రువు పాకిస్థాన్ అని చాలా మంది భావిస్తారు కానీ.. ఆ స్థానం చైనాది అని ఇటీవల యూఎస్ నివేదిక కూడా పేర్కొన్న సంగతి తెలిసిందే.;
ఏ విధంగా చూసినా భారత్ కు ప్రధాన శత్రువు పాకిస్థాన్ అని చాలా మంది భావిస్తారు కానీ.. ఆ స్థానం చైనాది అని ఇటీవల యూఎస్ నివేదిక కూడా పేర్కొన్న సంగతి తెలిసిందే. ప్రధానంగా అరుణాచల్ ప్రదేశ్ విషయంలో భారత్ కు ఎప్పటికైనా చైనా నుంచి ముప్పు ఉందని నిపుణులు చెబుతుంటారు. పైగా 2020లో గాల్వాన్ లోయలో జరిగిన రక్తపాతం ఎన్నో పాఠాలు నేర్పిందని చెబుతారు. ఈ నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.
అవును... భారత్ కు ఎప్పటికైనా చైనాతోనే సమస్య అనే చర్చ జరుగుతుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా.. అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) తాజాగా విడుదల చేసిన 'మిలిటరీ అండ్ సెక్యూరిటీ డెవలప్మెంట్స్ - 2025' నివేదికలో.. తైవాన్ తో పాటు తన 'ప్రధాన ప్రయోజనాల'లో అరుణాచల్ ప్రదేశ్ పై చైనా తన వాదనలు వినిపిస్తోందని పేర్కొంది. దీనికి తోడు 2020లో గాల్వాన్ లోయలో జరిగిన రక్తపాతం గురించి తెలిసినదే.
ఈ నేపథ్యంలో భారత్ సరికొత్త ఆలోచన చేసిందని అంటున్నారు. ఇందులో భాగంగా... చైనాతో వివాదాస్పద సరిహద్దు వెంబడి రోడ్లు, సొరంగాలు, వైమానిక క్షేత్రాల నెట్ వర్క్ ను నిర్మించడానికి భారత్ వందల మిలియన్ల డాలర్లను పెట్టుబడి పెడుతోందని చెబుతున్నారు. ఈ మేరకు వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనాన్ని వెల్లడించింది. భారత్ తాజా నిర్ణయంతో సరిహద్దుకు కనెక్టివిటీ సమస్య తీరిపోనుందని అంటున్నారు!
వాస్తవానికి 2020లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ భారతదేశ సైనిక, రాజకీయ నాయకత్వాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందనే చెప్పాలి. సుమారు 14,000 అడుగుల ఎత్తులో ఉన్న దళాలు ముళ్ల తీగలతో చుట్టబడిన కర్రలు, లాఠీలతో పోరాడాయి! ఈ సమయంలో చైనా విస్తృతమైన సరిహద్దు మౌలిక సదుపాయాల కారణంగా గంటల్లోనే బలగాలను వేగవంతం చేయగలగగా.. సరైన రోడ్లు లేని కారణంగా భారత్ చాలా నెమ్మదిగా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది!
ఈ నేపథ్యంలోనే భారత్ కీలక నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. అందులో ప్రధానమైనది జోజిలా సొరంగం! సుమారు 750 మిలియన్ డాలర్లకు పైగా ఖర్చుతో కూడుకున్న ఈ కీలక ప్రాజెక్ట్.. ఉత్తర భారత్ లోని మిగిలిన ప్రాంతాలతో లడఖ్ ను ఏడాది పొడవునా అనుసంధానించడానికి ఉద్దేశించబడింది. ఇది సుమారు 11,500 అడుగులు (3,500 మీటర్లు) ఎత్తులో పర్వతాల గుండా వెళ్తుంది.
ప్రతి శీతాకాలంలో భారీ హిమపాతం కారణంగా లడఖ్ తో సంబంధాలు నెలల తరబడి తెగిపోతాయని చెబుతారు. దీనివల్ల కాన్వాయ్ లు, చిన్న రోడ్ వాహనాలు, చివరికి 20,000 అడుగుల ఎత్తులో ఉన్న అవుట్ పోస్టులకు వస్తువులను మోసుకెళ్లే పోర్టర్లు, మ్యూల్స్ పై ఆధారపడే సరఫరా చైన్ బలవంతంగా మారుతుంది. ఈ నేపథ్యంలో జోజిలా సొరంగం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెబుతున్నారు!
ఈ నేపథ్యంలోనే... బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బడ్జెట్ 2020లో 280 మిలియన్ డాలర్ల నుంచి ఈ ఏడాది 810 మిలియన్ డాలర్లకు పెరిగిందని.. మొత్తం భారత సైనిక వ్యయం సుమారు 60% పెరిగి, దాదాపు 80 బిలియన్ డాలర్లకు చేరుకుందని జర్నల్ నివేదించింది. ఫలితంగా... వేల మైళ్ల సరిహద్దు రోడ్లను, 30కి పైగా హెలీప్యాడ్ లను నిర్మించిందని వెల్లడించింది.
ఇదే సమయంలో.. చైనా నుంచి కేవలం 19 మైళ్ల దూరంలో ఉన్న లడఖ్ లోని కొత్త ముధ్ న్యోమా స్థావరంతో సహా అనేక ఎయిర్ స్ట్రిప్ లను విస్తరించిందని పేర్కొంది. ఈ ముధ్ న్యోమా భారీ రవాణా విమానాలను నిర్వహించడంతో పాటు.. దళాలు, పరికరాలకు స్టేజింగ్ పాయింట్ గా ఉపయోగపడుతుంది.