అబ్బే... మోదీ పాలన బాలేదు

Update: 2019-01-26 15:59 GMT
"మోదీ పాలన బాగోలేదు. కాంగ్రెస్ కంటే భిన్నంగా ఆనందంగా ఉంటుందని అనుకున్నాము. మా ఆశాలు నిరాశలు అయ్యాయి." ఇది దేశంలో నరేంద్ర మోదీ పాలనపై 63 శాతం మది ప్రజలు వెల్లుబుచ్చిన అభిప్రాయం. మూడ్‌ ఆఫ్‌ ది నేషన్ నిర్వహించిన సర్వేలో దేశ ప్రజలు నరేంద్ర మోదీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని వెల్లడైంది. రానున్న లోక్‌ సభ ఎన్నికలలో బిజేపీ - దాని మిత్ర పక్షాలు అధికారంలోకి రావడం కష్టమేనని వెలువడిన విషయం తెలసిందే. ఈ సర్వేలో ఎన్నికల ఫలితాలతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ పని తీరుపై కూడా దేశ ప్రజలు తీవ్ర అసంత్రుప్తి వ్యక్తం చేస్తున్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనపై అనేక ఆశలు పెట్టుకున్న వారికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు - స్వచ్ఛ భారత్ అభియాన్ వంటి పథకాలు ప్రజలలో ఆశలు రేకెత్తించాయి. నరేంద్ర మోదీ చేపట్టిన నోట్ల రద్దు కూడా తొలి రోజులలో ఆశలు రేపింది. అయితే రానురాను ఆ పథకాలు - నోట్ల రద్దు వంటివి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసాయి. దీంతో అంత వరకూ ఉన్న నరేంద్ర మోదీ ప్రాభవం క్రమంగా తగ్గిపోయిందని సర్వేలో తేలింది.

మరోవైపు దేశంలో రైతుల పరిస్దితి నానాటికి దిగజారడం - చిన్ని చితక పరిశ్రమలు దెబ్బతినడం వంటివి నరేంద్ర మోదీ పాలనపై ప్రభావం చూపాయంటున్నారు. ముఖ్యంగా జిఎస్టీ తీసుకు రావడం వల్ల చిన్న చిన్న వ్యాపారులలో ఆర్దిక సంక్షోభం పెరిగిందని - దీని కారణంగా మధ్య తరగతి వారంతా నరేంద్ర మోదీకి వ్యతిరేకులు అయ్యారని సర్వేలో పలువురు అభిప్రాయ పడ్డారు. గత ఎన్నికలలో దేశంలో మంచి పరిస్దితులు వస్తాయని దానికి నరేంద్ర మోదీ నాయకత్వం వహిస్తారని చాల మంది ఆశించారు. అయితే అందుకు వ్యతిరేకంగా ఫలితాలు రావడంతో ప్రస్తుతం నరేంద్ర మోదీని వ్యతిరేకించేవారు రోజురోజుకు పెరుగుతున్నారని సర్వేలో తేలింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ దాని మిత్రపక్షాలు అధికారంలోకి రావడం కష్టమేనని సర్వేలో పలువురు అభిప్రాయపడ్డారు.


Tags:    

Similar News