కడప జిల్లాలో మళ్లీ భయం

Update: 2015-11-30 04:32 GMT
గత కొద్దిరోజులుగా కడప జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీగా భూమి కుంగటం తెలిసిందే. ఉన్నట్లుండి.. భూమి పెద్ద పెద్ద గోతులు పడటం ఇప్పుడు భయాందోళనలకు గురి చేస్తోంది. ఈ గోతులు ఎందుకు ఏర్పడ్డాయన్న విషయంపై ఎవరూ ఏమీ చెప్పని పరిస్థితి. గోతులు అంటే.. అదేదో చిన్నదనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే.. ఒక్కో గొయ్యి.. 20 నుంచి 25 అడుగుల వెడల్పు.. 40 నుంచి 50 అడుగుల లోతులో ఉండటం గమనార్హం.

ఇప్పటివరకూ కడప జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో దాదాపు 22 గోతులు ఏర్పడ్డాయి. ఒక్క ఆదివారం నాడే.. నాలుగు గోతులు ఏర్పడటం జిల్లా వాసులను భయాందోళనకు గురి చేస్తోంది. తాజాగా జిల్లాలోని చింతకొమ్మ దిన్నె మండలంలోని గూడవాడ్ల పల్లె.. బుగ్గలపల్లెల్లో మూడు గోతులు ఏర్పడ్డాయి. తాజాగా ఏర్పడిన గోతులు 20 అడుగుల లోతు.. 20 అడుగుల వెడల్పు ఉండటం గమనార్హం. మరి.. ఈ గోతుల వెనుక అసలు సంగతేమిటన్నది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఎందుకిలా జరుగుతుందన్న విషయంపై అధికారులు ఎవరూ పెదవి విప్పకపోవటం.. సంతృప్తికరంగా సమాధానాలు చెప్పకపోవటంతో కడపజిల్లా వాసులు తీవ్ర భయాందోళనలకు గురి అవుతున్నారు.
Tags:    

Similar News