33 మంది రైతులు మృతిచెందారు..మోడీ - అమిత్ షా పై కాంగ్రెస్ ఆగ్రహం!

Update: 2020-12-21 11:00 GMT
కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన కొనసాగుతోంది. 20రోజులకుపైగా ధర్నా చేస్తున్న అన్నదాతలు కేంద్రానికి తమ బాధను తెలియజేయడానికి రోజుకో విధంగా నిరసన తెలుపుతున్నారు. దీనిపై ఇప్పటికే కేంద్ర మంత్రులతో రైతు సంఘాల నాయకులు పలుమార్లు చర్చలు జరిపారు. అయినా ఎటువంటి ఫలితాలు వెలువడలేదు. దీంతో రైతులు తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తూనే ఉన్నారు. ఈ ఆందోళనల్లో ఇప్పటివరకు 33 మంది రైతులు మృతిచెందారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడికి దిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్ష్యంగా విమర్శలు చేస్తుంది.

దేశానికి అన్నం పెట్టె రైతన్నలు నిరసన తెలుపుతుంటే ప్రధాని మోడీ ఏంచేస్తున్నారు అంటూ మండిపడుతున్నారు. గతనెల 26వ తేదీ నుంచి రైతులు నిరసన తెలియజేస్తున్నారని , మరీ ఎందుకు ప్రభుత్వం స్పందించడం లేదని ప్రశ్నించింది. నిరసన చేపట్టి 33 మంది రైతులు చనిపోయినా.. ప్రధాని మోడీ ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించింది. 33 మంది రైతులు చనిపోవడంతో నిన్న ఆల్ ఇండియా కిసాన్ సభ శ్రద్దాంజలి దివాస్ నిర్వహించింది.  ఎముకలు కొరికే చలిలో భార్య, పిల్లలతో కలిసి రైతులు ఆందోళనకు దిగారు. వారిలో 33 మంది చనిపోతే ప్రధాని నోరు ఎందుకు విప్పడం లేదు అని అంటున్నారు. అలాగే  హోం మంత్రి అమిషాకు కూడా రైతుల గురించి ఆలోచించే సమయం లేదా అంటూ ప్రశ్నించారు. ఆయన పశ్చిమ బెంగాల్ వెళ్లేందుకు మాత్రం సమయం ఉందని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో చల్లని వాతావరణ ఉంది అని.. ఇంట్లో హీటర్ అన్ చేసి ఉంటున్నామని.. మరీ రైతులు రోడ్లపై నిరసన చేస్తే.. ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు అంటూ మండిపడుతున్నారు. మోడీ గురుద్వారాకు వెళ్లారు ఓకే.. ఆందోళన చేస్తే రైతుల వద్దకు ఎందుకు వెళ్లరు అని ప్రశ్నించారు.
Tags:    

Similar News