2015 ను హాటెస్ట్ ఇయర్ గా గా ప్రకటించారు

Update: 2015-08-31 11:30 GMT
భూమిమీద వేడి పెరుగుతుంది.. సీజన్ తో సంబందం లేకుండా సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు.. రోజు రోజుకీ గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది.. ఇవి నిత్యం వినిపించే మాటలే కదా అని లైట్ తీసుకోకూడదు! ఇంతకాలం లైట్ తీసుకున్నది చాలు.. ఇకపై జాగ్రత్తగా ఉండాలి! చెట్లు బాగా పెంచాలి, కాలుష్యం తగ్గించాలి. అలాకాకుండా ఇలాగే ఉంటే మాత్రం భవిష్యతులో మల మల మాడిపోవాడం ఖాయం! తాజాగా శాస్త్రవేత్తలు చెప్పిన విషయాలు ఇదే విషయాన్ని క్లియర్ గా చెబుతున్నాయి!

మానవ తప్పిదాలే కారణాలుగా రోజు రోజుకీ ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. ఇందుకు సాక్ష్యంగా 1888 నుంచి ఇప్పటివరకూ ఈ ఏడాది నమోదైనంత గరిష్ట ఉష్ణోగ్రతలు మునుపెన్నడూ నమోదు కాలేదంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. గత శతాబ్ధంలో పోలిస్తే ఈ శతాబ్ధంలో పెరిగిన ఉష్ణోగ్రత 1.46 సెల్సియస్... ఇది చాలా చిన్న నెంబరుగా కనిపించొచ్చు కానీ.. పెద్ద ప్రమాదానికి ఇది చిన్న సంకేతం మాత్రమే అంటున్నారు శాస్త్రవేత్తలు!

ఇంకా మూడు మాసాలు మిగిలి ఉండగానే... 2015 ను హాటెస్ట్ ఇయర్ గా సైటిస్టులు ప్రకటించారు! ఇటువంటి పరిస్థితుల్లో 2016 ఈ రికార్డును చెరపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అలాకాని పక్షంలో భవిష్యత్ తరాలకు పెను ప్రమాదాలే పొంచి ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు!
Tags:    

Similar News