పనామాలో మనోళ్లు 500 కాదు 2 వేల మంది

Update: 2016-05-11 04:49 GMT
ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పనామా పేపర్స్ కుంభకోణంలో భారతదేశానికి చెందిన 500 మంది ఉన్నట్లుగా అప్పట్లో ప్రచారం జరగటం తెలిసిందే. తాజాగా విడుదలైన పత్రాలతో పాటు.. భారతీయుల జాబితాను ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ బృందం మరో కొత్త జాబితాను విడుదల చేసింది. ఇందులో భారతీయులు 2 వేల మంది ఉండటం గమనార్హం. కొత్త జాబితాలో భారతీయులతో సంబంధం ఉన్న 22 విదేశీ కంపెనీల వివరాలు బయటకు వచ్చాయి.

1046 మంది అధికారులు.. వ్యాపారులు.. సెలబ్రిటీలతో కూడిన వ్యక్తిగత సమాచారం పనామా పేపర్స్ బయటపెట్టింది. తాజా జాబితాలో మనోళ్లు నగరాలు.. పట్టణ ప్రాంతాలకు చెందిన వారే కాదు.. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు కూడా ఉండటం గమనార్హం. చిన్న చిన్న గ్రామాలకు చెందిన అడ్రస్ లను పనామా పేపర్స్ విడుదల చేసింది.

తొలుత భారతీయులు 500 మంది ఉన్నట్లు ప్రకటించినా.. మొత్తంగా విడుదలైన పత్రాలతో ఈ సంఖ్య 2 వేలకు పెరగటం గమనార్హం. పనామా పేపర్స్ లో తాజాగా బయటకు వచ్చిన పేర్లపై ఈడీ.. ఆదాయపన్ను శాఖాధికారులు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. సో.. రానున్న రోజుల్లో పనామా పేపర్స్ ప్రభావంతో చాలానే అవినీతి అనకొండలు బయటకు రావటం ఖాయమంటున్నారు.
Tags:    

Similar News