• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  9/11: ఆ చీకటి రోజుకు 20...

9/11: ఆ చీకటి రోజుకు 20 ఏళ్లు .. దాడి ఎలా జరిగిందంటే?

By - Tupaki Desk
Update: 2021-09-11 10:16 GMT
2001 సెప్టెంబర్ 11.. ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అమెరికా లోని న్యూయార్క్ నగరంలో ఉన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ పై అల్‌ ఖైదా పక్కా వ్యుహంతో జరిపిన ఉగ్రదాడి. జనాలను భయకంపితులను చేసింది. ఇది చరిత్రలో ఉగ్రవాదులు జరిపిన అతిపెద్ద దాడి. దాదాపు 3వేల మందిని ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. ఈ దాడిలో వేలాది మంది గాయపడ్డారు. అంతేకాకుండా ఆ సమీప ప్రాంతాలలోని ప్రజల ఆరోగ్యంపై ఈ ఉగ్రదాడి తీవ్ర ప్రభావం చూపింది. ఆ సన్నివేశాలను కళ్లారా చూసిన కొందరు, ఆ దృశ్యాలను తలచుకుంటే ఇప్పటికీ భయం వేస్తుందని వాపోతున్నారు.

నేటితో 9/11 మరణహోమానికి 20 ఏళ్లు  పూర్తి చేసుకోబోతుంది. ఆ రోజు అమెరికాలో అసలు ఏం జరిగిందంటే .. అల్‌ ఖైదా చీఫ్‌ ఒసామా బిన్‌ లాడెన్‌ నేతృత్వంలో అమెరికాలో నాలుగు చోట్ల విమానాలతో దాడి చేసేందుకు ప్రణాళికలు రచించారు. ప్లాన్ ప్రకారం 19 మంది ఉగ్రవాదులు నాలుగు జట్లుగా విడిపోయి మొత్తం నాలుగు విమానాలను హైజాక్ చేశారు. ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి దాడులకు అంతా సిద్దం చేసుకున్నారు. మొదట ఓ విమానంతో అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 8.46కు నార్త్ టవర్‌ ను ఢీకొనగా, రెండో విమానం ఉదయం 9.03 నిమిషాలకు సౌత్ టవర్‌ లోకి దూసుకెళ్లింది. దీంతో ట్విన్‌ టవర్స్‌ చూస్తుండగానే కుప్పకూలిపోయాయి.

మంటలు, దట్టమైన పొగ, ఆర్తనాదాలు, ఆ ప్రాంతం మొత్తం జనాల ఆర్తనాదాలతో నిండిపోయింది. ట్విన్ టవర్స్ పరిసర ప్రాంతాల్లోని బిల్డింగ్‌ లు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలను పలువురు తమ కెమెరాల్లో బంధించారు. ఆ ప్రాంతంలో కొన్నిచోట్ల వందల డిగ్రీల ఉష్ణం చోటుచేసుకుంది. చాలా మంది ఆ మంటల్లో కాలిపోయారు. కొందరు ఏం చేయాలో తెలియక పై నుంచి దూకేశారని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతారు. ఈ ఉగ్రదాడి నుంచి జనాలను రక్షించేందుకు యత్నించిన పలువురు అగ్నిమాపక సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే ప్రఖ్యాత ట్విన్ టవర్స్ కూలిపోయాయి.

మూడో విమానం అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 9.37 నిమిషాలకు అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ పశ్చిమం వైపు భాగాన్ని ధ్వంసం చేసింది. నాలుగో విమానం ఉదయం 10.03 నిమిషాలకు పెన్సిల్వేనియాలో కూలిపోయింది. ఈ విమానంతో వాషింగ్టన్‌లోని క్యాపిటల్ భవనాన్ని ఢీకొట్టాలని హైజాకర్లు ప్లాన్ వేసినట్టుగా భావిస్తారు. ఇక, ట్విన్ టవర్స్‌పై దాడి జరిగిన సమయంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్, ఫ్లోరిడాలోని ఓ ప్రాథమిక పాఠశాలలో కార్యక్రమానికి హాజరయ్యారు. బుష్ పిల్లలతో ముచ్చటిస్తున్న సమయంలో అప్పటి వైట్ హౌజ్‌ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆండ్రూ కార్డ్ బుష్ చెవిలో చెప్పారు. అయితే అక్కడ పిల్లలు ఆందోళన చెందకుడదనే ఉద్దేశంతో సమయం పాటించని, వీలైనంత త్వరగా ఆ కార్యక్రమాన్ని ముగించిన అక్కడి నుంచి బయటకు వచ్చారు.


ఇక, మొత్తం ఈ దాడుల్లో 93 దేశాలకు చెందిన 2,977 మంది మరణించారు. న్యూయార్క్‌ లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ వద్ద దాడిలో 2,753 మంది మృతిచెందారు. పెంటగాన్‌ లో 184 మంది మరణించారు. పెన్సిల్వేనియాలో కుప్పకూలిన ఫ్లైట్ 93 లో 40 మంది మరణించారు. ఇక, ఈ దాడులకు అల్‌ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ అఫ్గానిస్తాన్‌ లో ప్రణాళిక వేసినట్టుగా అమెరికా నిర్ధారణకు వచ్చింది. దీంతో అప్పటి అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుస్.. తాలిబన్ల పాలనలో అఫ్గాన్‌‌లో అమెరికా కాలుమోపాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే బిన్ లాడెన్‌ తో పాటు పలువురు ఉగ్రవాదులను అమెరికా బలగాలు మట్టుబెట్టాయి. అయితే దాదాపు 20 ఏళ్ల పాటు అఫ్గాన్‌ లోనే ఉన్న అమెరికా, దాని మిత్రదేశాల బలగాలు, 2021 ఆగస్టు 30వ తేదీన అఫ్గాన్‌ను పూర్తిగా ఖాళీ చేశాయి.
Tags:    
  • Twin Towers 
  • Latest News 
  • Telugu News 
  • Tupaki Updates 

Similar News

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?

2026-11-06 06:30 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

డెమోక్రాట్లు గెలిచారు కదా.. ట్రంప్ ను దించేయవచ్చా?

2026-11-06 03:56 GMT

పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్ ?

2026-11-06 03:50 GMT

వంగవీటి పట్టాభిషేకానికి మెగాస్టార్...బాలయ్య ?

2026-11-06 03:50 GMT

కూటమి పద్మవ్యూహంలో వైసీపీ విలవిల !

2026-11-06 03:49 GMT

చంద్రబాబు మీద కేసులు.... సీబీఐకి అప్పగించాలి !

2026-11-06 03:47 GMT

Copyright @2026

Powered by Blink CMS