బీహార్ లో స్లోగా పోలింగ్: రెండు భారీ బాంబులు స్వాధీనం

Update: 2020-10-28 08:30 GMT
కరోనా వైరస్ తో అన్ని పనులు ఆగిపోయాయి. ఇప్పుడిప్పుడే పునరుద్ధరణ జరుగుతోంది. దేశంలో తొలిసారి బీహార్ ఎన్నికలతో మళ్లీ సాధారణ పరిస్థితులు కల్పించేందుకు కేంద్రం సిద్ధమైంది. తాజాగా బీహార్ లో కరోనా నిబంధనలు పాటిస్తూ తొలివిడత పోలింగ్ ను నిర్వహిస్తున్నారు.

బీహార్ తొలి విడత పోలింగ్ మందకొడిగా సాగుతోంది. మొత్తం 71 స్థానాలకు ఈ పోలింగ్ జరుగుతోంది. కోవిడ్19 జాగ్రత్తలు తీసుకుంటూ బీహార్ ప్రజలు ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. శానిటైజర్లు, మాస్కులు, హ్యాండ్ వాషులకు ఓటర్లకు అందుబాటులో ఉంచారు. మందకొడి పోలింగ్ ను చూసిన ప్రధాని మోడీ బీహార్ ప్రజలందరూ బయటకు వచ్చి  ఓటు వేయాలని కోరారు.   ఓటింగ్ శాతం బాగా తగ్గుతుందని.. ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరారు.   

బీహార్ ఎన్నికల్లో తొలిగంటలో కేవలం 5శాతం మాత్రమే పోలింగ్ నమోదుకావడం అధికారులకు షాకిచ్చింది. ఉదయం 9 గంటల వరకు కేవలం 6.03శాతం మంది మాత్రమే ఓటుహక్కు వినియోగించుకున్నారు. బీహార్ తొలి విడతలో 71 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1.01 కోట్ల మంది మహిళలు ఉన్నారు. 599 మంది థర్డ్ జెండర్ ఉన్నారు.

కాగా బీహార్ తొలి విడత ఎన్నికల వేళ బాంబులు కలకలం రేపాయి. ఔరంగాబాద్ లో గల దిబ్రా ప్రాంతంలో రెండు భారీ ఐఈడీ బాంబులను సీఆర్పీఎఫ్ స్వాధీనం చేసుకుంది. వాటిని దూరంగా తీసుకెళ్లి నిర్వీర్యం చేశారు. దీంతో ఓటువేయడానికి వచ్చిన ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.

ఈ పేలుడు పదార్థాలు ఎవరు పెట్టారనే దానిపై పోలీసులు ఆరాతీస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
Tags:    

Similar News