కెనడాలో కాల్పుల కలకలం ..16 మంది మృతి !
కెనడాలో ఆదివారం దారుణ ఘటన చోటుచేసుకుంది. నోవా స్కోటియా ప్రాంతంలో దుండగుడు పోలీసుల దుస్తులు ధరించి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 16 మంది చనిపోయారు. మృతుల్లో ఒక మహిళా పోలీసు కూడా ఉన్నారు. అయితే పోలీసుల ఎదురు కాల్పుల్లో దుండగుడు గాబ్రియేల్ వోర్ట్‌మన్ చనిపోయాడని అధికారులు ధృవీకరించారు. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో స్థానిక ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించాయి.
కాల్పులు జరిగిన స్థలంలో ప్రజలు గుంపులుగా లేకపోవడంతో మృతుల సంఖ్య తగ్గిందని స్థానిక మీడియా వెల్లడించింది. 30 ఏళ్ల కెనడా చరిత్ర ఇలాంటి దారుణమైన సంఘటన జరిగిందని అధికారులు తెలిపారు. 1989లో దుండగుడు కాల్పులు జరపడంతో 18 మంది మరణించారు. అప్పటి నుంచి కెనడాలో తుపాకుల వాడకంపై ప్రభుత్వం నిషేధం విధించింది.
ఈ సంఘటన పై పోలీసులు మాట్లాడుతూ.. గతంలో దంత వైద్యుడిగా పనిచేసిన 51 ఏళ్ల గాబ్రియేల్ వోర్ట్ మన్ ఈ దాడికి పాల్పడ్డాడని, పోలీస్ డ్రెస్ ధరించి, తన కారును కూడా పోలీసు వాహనంలా మార్చి గాబ్రియేల్ ఈ దాడి చేశాడని చెప్పారు. నోవా స్కోటియాలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ గాబ్రియల్ కాల్పులు జరిపాడని తెలిపారు. ఈ ఘటనలో మరణించిన మహిళ పోలీస్ ... గత 23 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమెకు ఇద్దరు చిన్నారులు ఉండగా, వారు ఇప్పుడు తల్లిని కోల్పోయారు. దుండగుడు ఎందుకు ఇలా చేశాడు అనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.