వైఎస్సార్సీపీలో 15 మంది సిట్టింగుల పరిస్థితి బాలేదా?
వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల్లో పదిహేను మంది పరిస్థితి కాస్త తేడా ఉందని సమాచారం. ఈ మేరకు సర్వేల్లో వెల్లడి అవుతున్నట్టుగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో విజయం సాధించిన వీరిలో ఐదేళ్లు గడిచే సరికి కొంత వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. దీనికి పలు కారణాలున్నాయి.
ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు నాయుడు పూర్తిగా నిధులు కట్ చేశాడు. వారికి నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇవ్వలేదు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు ముందుగా ప్రలోభాలు పెట్టడం.. వారు తన పార్టీలోకి రావాలని అనడం బాబు ఒకటో అస్త్రం. వారు రాకపోతే వారికి నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఆపేశారు. ఆయా నియోజకవర్గాల్లో.. తెలుగుదేశం నేతల చేతికే నియోజకవర్గం అభివృద్ధి నిధులను ఇచ్చారు.
ఇలా చంద్రబాబు నాయుడు అధికార దుర్వినియోగానికి కూడా వెనుకాడలేదు. ఇక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు క్యాడర్ ను నిలుపుకోవడం కూడా అంత తేలిక కాదు. ఇలాంటి నేఫథ్యంలో .. పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారనే మాట వినిపిస్తోంది.
మరి వీరి విషయంలో జగన ఎలా చేస్తారనేది ఆసక్తిదాయకమైన అంశం. తన వైపు నిలిచిన ఎమ్మెల్యేల్లో చాలా మందికి జగన్ అభ్యర్థిత్వాలను ఖరారు చేసే అవకాశాలున్నాయి. టీడీపీ ప్రలోభాలను తట్టుకుని వారు పార్టీలో నిలబడ్డారు. ఆ కారణంగా జగన్ వారికి అభ్యర్థిత్వాలను ఇచ్చే అవకాశాలున్నాయి. మరి ఈ వ్యవహారంలో ఏం జరుగుతుందో చూడాలి!