ప్రణబ్ ముఖర్జీ లక్కీ ‘13’ గురించి తెలుసా?

Update: 2020-09-01 05:30 GMT
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ప్రధాని పదవి తప్ప అన్ని అత్యున్నత పదవులను అనుభవించారు. కానీ ఆయన జీవితంలో ‘13’ నంబర్ కు ప్రత్యేక స్థానం ఉంది. దానితో ఎంతో అనుబంధం కూడా ఉంది.

ప్రణబ్ ముఖర్జీ అదృష్ట సంఖ్యగా 13 చెబుతారు. ఈ సంఖ్యతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది. ఆయన వివాహం అయ్యింది 1957 జూల్ 13న కావడం విశేషం.

ఇక ప్రణబ్ లోక్ సభకు ఎన్నికైంది 2004 మే 13న కావడం విశేషం.  యూపీఏ ప్రభుత్వంలో పార్లమెంట్ లోని రూమ్ 13లోనే ప్రణబ్ కార్యాలయం ఉండేది. అలాగే భారత 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ ఎన్నికవ్వడం విశేషం.

ఆయన పుట్టిన రోజుకూడా 13వ తేదీనే అంటారు. దానిపై క్లారిటీ లేదు. కానీ ఇలా 13వ తేదితో ప్రణబ్ ముఖర్జీకి విడదీయరాని అనుబంధం ఉందంటారు.
Tags:    

Similar News