కేసీఆర్ విషయంలో రేవంత్ తీరు వేరే లెవెల్

ఇక తాజాగా చూస్తే ఇద్దరు మహిళా మంత్రులను ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫాం హౌజ్ కి పంపించి మరీ మేడారం మహా జాతరకు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సాదరంగా ఆహ్వానించడం అన్నది మంచి విషయం అని అంటున్నారు.;

Update: 2026-01-08 19:28 GMT

తెలంగాణా రాష్ట్ర ఉద్యమ కర్తగా అలాగే రాష్ట్రాన్ని సాధించిన యోధుడిగా కేసీఆర్ కి చరిత్రలో శాశ్వతమైన పేరు ఉంది. ఇక తెలంగాణా రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఆయన రికార్డు క్రియేట్ చేశారు. దాంతో ఆయన మీద రాజకీయంగా ఎవరెన్ని విమర్శలు చేసినా వ్యక్తిగతంగా చూస్తే గౌరవిస్తారు అని అంటూంటారు. ప్రస్తుతం తెలంగాణాకు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ విషయంలో రాజకీయంగా పరుషంగా విమర్శలు చేసినా వ్యక్తిగతంగా ఆయన గౌరవానికి ఇబ్బంది కలిగించలేదు అని అంటారు. దానికి ఉదాహరణ తాజాగా ముగిసిన తెలంగాణా అసెంబ్లీ శీతాకాల సమావేశాలలో తొలి రోజున కేసీఆర్ హాజరైనప్పుడు ఆయన సీటు వద్దకు వచ్చి రేవంత్ రెడ్డి నమస్కరించడం అంతా చూశారు. దానిని స్ఫూర్తి వంతంగా తీసుకోవాలని రెండు తెలుగు రాష్ట్రాలలో వినిపించిన మాట. ఇదే కాదు చాలా సందర్భాలలో రేవంత్ రెడ్డి కేసీఆర్ ని తాము గౌరవిస్తామని ఆయన రాజకీయ అనుభవాన్ని తెలంగాణా అభివృద్ధి కోసం వినియోగించాలని సభకు వచ్చి సలహా సూచనలు ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యేగా ఎంపీగా కేంద్ర మంత్రిగా రాష్ట్ర మంత్రిగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ కి ఉన్న అపారమైన అనుభవంతో పాజిటివ్ గా రియాక్ట్ కావాలని కూడా పేర్కొన్నారు.

సాదరంగా ఆహ్వానం :

ఇక తాజాగా చూస్తే ఇద్దరు మహిళా మంత్రులను ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫాం హౌజ్ కి పంపించి మరీ మేడారం మహా జాతరకు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సాదరంగా ఆహ్వానించడం అన్నది మంచి విషయం అని అంటున్నారు. మహిళా మంత్రులు సురేఖ, సీతక్క స్వయంగా కేసీఆర్ వద్దకు వెళ్ళి ఆహ్వానం అందచేసారు. ఈ సందర్భంగా వారికి కేసీఅర్ చీరలు బహూకరించారు. కేసీఅర్ ని అసెంబ్లీ సమావేశాల ద్వారా కలవలేకపోయామని అందుకే ఎర్రవెల్లికి వచ్చి సాదరంగా ఆహ్వానించామని మంత్రులు చెప్పారు. కేసీఆర్ తమ ఆహ్వానానికి సానుకూలంగా స్పందించారు అని జాతరకు వస్తానని చెప్పారు అని వారు పేర్కొన్నారు.

ఇది మంచి సంప్రదాయం :

ప్రతిపక్షంలో ఉన్న నాయకుడి ఇంటికి వెళ్ళి ప్రభుత్వం తర్ఫున ఒక కీలక కార్యక్రమానికి ఆహ్వానం పలకడం అన్నది ఒక మంచి సంప్రదాయంగానే అంతా చూస్తున్నారు. రాజకీయంగా ఎన్ని అయినా విమర్శలు చేసుకోవచ్చు. అయితే ప్రభుత్వ ప్రజా కార్యక్రమాలు జరిగినపుడు అందరినీ ఆహ్వానించాలని అంతా ఒక్క చోటకు చేరాలన్నది ఆచరణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసి చూపుతోంది అని అంటున్నారు. ఒక విధంగా మాటలతో విమర్శల దాడి ఒక వైపు చేస్తున్నట్లుగా కనిపిస్తున్నా మరో వైపు రేవంత్ రెడ్డి మాత్రం కేసీఆర్ కి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నారు అని అంటున్నారు. దేశంలో చాలా రాష్ట్రాల్లో లేని ఈ విధానం తెలంగాణాలో సీఎం రేవంత్ రెడ్డి అమలు చేయడం పట్ల సర్వత్రా హర్షం అయితే వ్యక్తం అవుతోంది.

Tags:    

Similar News