13 గంటల విమాన ప్రయాణం.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన పైలట్..!

Update: 2023-01-31 13:03 GMT
విదేశాలకు త్వరగా వెళ్లాలంటే విమాన ప్రయాణాన్ని మించింది లేదనే విషయం అందరికీ తెలిసిందే. ప్రయాణికులు ముందస్తుగానే టికెట్లు బుక్ చేసుకొని తమ షెడ్యూల్ ప్రకారంగా విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. అయితే గగనతలంలో 13 గంటలపాటు విమానంలో ప్రయాణించిన ప్రయాణికులు తిరిగి అదే చోటికి చేరుకున్న వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కష్టం. ఇలాంటి సంఘటన కొంతమంది ప్రయాణీకులకు అనుభవమైంది.

ఈ ఘటన దుబాయ్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..! దుబాయ్ నుంచి న్యూజిల్యాండ్ కు వెళ్లాల్సిన ఈకే 448 ఎమిరేట్స్ విమానం 13 గంటల పాటు గగనతలంలో ప్రయాణించింది. అయితే ఊహించని విధంగా ఎక్కడి నుంచి టేకాఫ్ అయిందో తిరిగి అదే చోట ల్యాండింగ్ కావడంతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఈ ఘటన గత శుక్రవారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 10:30 గంటలకు ఈకే 448 ఎమిరేట్స్ విమానం దుబాయ్ నుంచి టేకాఫ్ అయింది. దాదాపు తొమ్మిది వేల మైళ్ల దూరం ప్రయాణించింది.

సగానికి పైగా దూరం వెళ్లిన విమానం తిరిగి వెనక్కి రావాల్సి వచ్చింది. వరదల కారణంగా న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ ఎయిర్ పోర్ట్ పూర్తిగా మూసివేయబడింది. ఈ సమాచారంతో పైలెట్ ఈకే 448 ఎమిరేట్స్ విమానాన్ని వెనక్కి తీసుకొచ్చాడు.

ఈ నేపథ్యంలో ఈ విమానం దుబాయ్ ఎయిర్ పోర్టుకు అర్ధరాత్రి చేరుకుంది. ఫైట్ ల్యాండ్ అయిన అనౌన్స్ మెంట్ విని ప్రయాణికులంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఈ సంఘటనపై అక్లాండ్ ఎయిర్ పోర్ట్ నిర్వాహాకులు విచారణ వ్యక్తం చేశారు. ఈ మేరకు తమకు ప్రయాణీకుల భద్రతే ముఖ్యమని ఒక ప్రకటనను విడుదల చేసింది.

కాగా తీవ్ర వరదలతో మునిగిపోయిన ఆక్లాండ్ ఎయిర్ పోర్ట్ ను తిరిగి జనవరి 29న పునః ప్రారంభించారు. దీంతో విమాన ప్రయాణాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఏది ఏమైనా ఈ ఘటన మాత్రం విమాన ప్రయాణీకులకు ఊహించని షాకిచ్చిందనే కామెంట్స్ సర్వత్రా విన్పిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.



Similar News