వైరస్ ను గెలిచిన 103 ఏళ్ల బామ్మ ...ఎలా సెలెబ్రేట్ చేసుకుందంటే !

Update: 2020-05-29 08:45 GMT
వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తోంది. ఈ మహమ్మారి బారిన పడి... ఇప్పటికే 3.6 లక్షల మందికి పైగా మృతి చెందారు. ఇంకా చాలామంది హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్నారు. అగ్రరాజ్యం అమెరికాలో రోజూ మరణ మృదంగమే మోగుతోంది. అక్కడ అంతలా ఈ రాకాసి మహమ్మారి విరుచుకు పడుతోంది. ఇక కోలుకుంటున్నవారు కోలుకుంటున్నారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే వృద్ధులకు సోకిన కరోనావైరస్ నుంచి ప్రాణాలతో బయటపడ్డ వారు అతి తక్కువ మంది ఉన్నారు. అలాంటి వారిలో అమెరికాకు చెందిన ఓ వందేళ్ల బామ్మ కూడా ఉన్నారు. అలాగే ఈ  వైరస్‌ను జయించిన ఈ బామ్మ ఎలా సెలబ్రేట్ చేసుకుంటుందో తెలిస్తే సర్‌ప్రైజ్ అవుతారు.

ఈ 103 ఏళ్ల బామ్మ పేరు జెన్నీ స్టెజ్నా. అప్పటివరకు చాలా ఆరోగ్యంగా ఉన్న ఈ బామ్మను  ఈ వైరస్ కాటేసింది. దీంతో ఈ బామ్మ వయస్సు చూస్తే ఇక బతకరని చాలామంది భావించారు. అయితే జెన్నీ స్టెజ్నా మాత్రం అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ అనూహ్యంగా ప్రాణాలతో బయటపడింది.  వైరస్‌పై విజయం సాధించింది. మూడు వారాల క్రితం జెన్నీకి  వైరస్ సోకింది. అయితే ఎక్కడా అధైర్య పడలేదు. వృద్ధులకు సోకితే దాదాపు ప్రాణాలతో బయటపడరనే నిజం తెలిసినప్పటికీ ఈ వందేళ్ల బామ్మ మాత్రం అధైర్య పడలేదు. తప్పకుండా విజయం సాధిస్తాననే గట్టి నమ్మకం చివరి వరకు  దైర్యంగా నిలబడింది.
Read more!

ఇక హాస్పిటల్‌ లో చేరిన సమయంలో స్టెజ్నా పరిస్థితి విషమించింది. అయినా ఆమె ధైర్యం కోల్పోలేదు. ఇక బయట ఉండి ఈమె ఆరోగ్యపరిస్థితి గమనిస్తున్న వారు అప్పటికే తమ బంధువులకు ఈమె బతికే అవకాశం లేదని చివరిసారిగా చూసేందుకు రండి అంటూ కబురు పంపారు. నిపోతే స్వర్గానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించగా అందుకు ఈ బామ్మ నేను చనిపోతున్నానని ఎవరూ చెప్పారు..? కచ్చితంగా ఈ మహమ్మారిపై విజయం సాధిస్తాననే ఆత్మ విశ్వాసం వ్యక్తం చేసిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక తమ బామ్మ పూర్తిగా కోలుకున్నారని హాస్పిటల్ వర్గాలు మే 13న సమాచారం ఇచ్చినట్లు కుటుంబసభ్యులు చెప్పారు. ఇక సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చిన బామ్మ ఒక చిల్డ్ బీర్తో  సెలబ్రేట్ చేసుకుంది. బీర్ అంటే బామ్మకు చాలా ఇష్టం అంట.
Tags:    

Similar News