అమెరికాలో పుడితే పౌరసత్వం ఇచ్చేస్తారా?..

అమెరికాలో తాత్కాలిక వీసాపై ఉద్యోగాలు చేసే జంటకు అక్కడే పిల్లలు పుడితే అటోమెటిక్ గా సిటిజన్ షిప్ లభిస్తుంది.;

Update: 2025-12-06 11:30 GMT

అమెరికాలో తాత్కాలిక వీసాపై ఉద్యోగాలు చేసే జంటకు అక్కడే పిల్లలు పుడితే అటోమెటిక్ గా సిటిజన్ షిప్ లభిస్తుంది. ఈ అవకాశాన్ని భారత్ లాంటి దేశాల ప్రజలు చాలా చక్కగా వాడుకుంటూ వచ్చారు. అమెరికా వెళ్ళిన ఇండియన్ మహిళలు కన్సీవ్ అయితే పిల్లుల పుట్టేదాకా ఇండియావైపు రారు. కారణం తమ పిల్లలకు పౌరసత్వం లభిస్తుందనే. దశాబ్దాల కాలంగా వస్తున్న ఈ అనవాయితీకి ట్రంప్ సర్కార్ చెక్ పెట్టింది. తాత్కాలికంగా ఉద్యోగ నిమిత్తం వచ్చి ఇక్కడ పిల్లల్ని కన్నంత మాత్రాన వారికి సిటిజన్ షిప్ ఇవ్వబోమని కరాఖండిగా ట్రంప్ ప్రకటించడమే కాకుండా ఆదేశాలు జారీ చేశారు. ఇది సంచలనంగా మారింది. అయితే ఈ ఆదేశాలపై పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసు ట్విస్టులపై ట్విస్టులు తిరుగుతోంది.

యూఎస్ సుప్రీం కోర్టు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆదేశాలపై వాదనలు వినడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది అమెరికాలో జన్మించిన విదేశీ పిల్లలకు జన్మత: లభించే పౌరసత్వం ఇకపై కుదరదని ట్రంప్ ఇచ్చిన ఆదేశాల చట్టబద్దతను నిర్ణయించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. వందేళ్లకు పైగా అమల్లోఉన్న ఈ చట్టాన్ని సవరించేందుకు ట్రంప్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

జనవరి 20న ట్రంప్ ఆధికారికంగా బాధ్యతలు స్వీకరించాక...అమెరికాలో పుట్టబోయే విదేశీ పిల్లలకు లభించే అమెరికా పౌరసత్వానికి సంబంధించి కీలక ఆదేశాలపై సంతకాలు పెట్టారు. ఫిబ్రవరి 19 తర్వాత పుట్టిన పిల్లలకు అమెరికా పౌరసత్వం కల్పించకుండా నిలిపివేయాలని ఫెడరల్ ఏజెన్సీలను ఆదేశించారు. తలిదండ్రులు అమెరికా సిటిజన్లు , శాశ్వత నివాసులు కాకపోతే వారికి పుట్టే పిల్లలకు సిటిజన్ షిప్ ఇవ్వరాదని నిర్ణయించారు.

అమెరికాలో తాత్కాలికంగా పనిచేసే, సందర్శించే విదేశీయలకు చట్టం పౌరసత్వం కల్పించదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కార్యాలయ నిర్వాహకాధికారులు వాదిస్తున్నారు. అమెరికాను తాత్కాలికంగా సందర్శించే విదేశీయులు ఇక్కడి చట్టపరిధి కిందికి రారు కాబట్టి...వారి పిల్లలకు పౌరసత్వం కల్పించాల్సిన అవసరం లేదని వారంటున్నారు. అయిత ఈ ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు అందిన వెంటనే దీన్ని సవాలు చేస్తూ న్యాయస్థానంలో పలు కేసులు పడ్డాయి. దీంతో పలువురు ఫెడరల్ న్యాయమూర్తులు ఈ ఆదేశాన్నితాత్కాలికంగా నిలిపివేశారు.

అయితే జూన్ 27న సుప్రీం కోర్టు స్పందిస్తూ జిల్లాల్లోని ఫెడరల్ కోర్టులకు ఇలా దేశవ్యాప్తంగా ఆదేశాలు, యూనివర్సల్ ఇంజెక్షన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేసే అధికారం లేదని తేల్చి చెప్పింది. ఈ వివాదాస్పద అంశాన్ని సుప్రీం కోర్టే పరిశీలించాలని నిర్ణయించుకుంది.

అమెరికా సిటిజన్లు కాని వారి పిల్లలకు అమెరికా చట్టాలు వర్తించవని అధికారులు అంటున్నారు. కాబట్టే పుట్టిన వెంటనే వారికి యూఎస్ సిటిజన్ షిప్ అప్రయత్నంగా దక్కదని చెబుతున్నారు. అయితే 24 రిపబ్లిక్ పాలిత రాష్ట్రాలు, 27 జీవోపీ లా నిపుణులు, సెనేటర్ టెడ్ క్రుజ్, లిండ్సే గ్రహమ్ ఈ పాలసీని ఆపాల్సిందిగా కోర్టును అభ్యర్థిస్తున్నారు.

Tags:    

Similar News