అమెరికాలో భారత సంతతి వైద్యుడిపై సంచలన ఆరోపణలు

అమెరికాలోని న్యూజెర్సీలో భారత సంతతికి చెందిన వైద్యుడు డాక్టర్ రితేష్ కాల్రా తీవ్రమైన ఆరోపణలపై అరెస్ట్ అయ్యారు.;

Update: 2025-07-20 17:26 GMT

అమెరికాలోని న్యూజెర్సీలో భారత సంతతికి చెందిన వైద్యుడు డాక్టర్ రితేష్ కాల్రా తీవ్రమైన ఆరోపణలపై అరెస్ట్ అయ్యారు. లైంగిక దుష్ప్రవర్తన, అధిక శక్తివంతమైన డ్ర*గ్స్‌ను అక్రమంగా పంపిణీ చేయడం, హెల్త్‌కేర్ మోసాలకు సంబంధించి ఆయనపై ఐదు ఫెడరల్ కేసులు నమోదు చేయబడ్డాయి.

31,000కు పైగా ఓక్సీకోడోన్ మోతాదులు అక్రమ పంపిణీ

డాక్టర్ కాల్రా ఫెయిర్ లాన్‌లోని తన క్లినిక్‌ను “పిల్ మిల్” (అక్రమంగా మందులు రాసే కేంద్రం)గా నడిపారని ఆరోపణలున్నాయి. 2019 జనవరి నుంచి 2025 ఫిబ్రవరి మధ్య కాలంలో ఆయన 31,000కు పైగా ఓక్సీకోడోన్ మందుల మోతాదులను చట్టవిరుద్ధంగా రాసినట్లు గుర్తించారు. కొన్ని రోజుల్లోనే ఆయన 50కిపైగా ప్రిస్క్రిప్షన్‌లు ఇచ్చినట్లు రికార్డులు చూపిస్తున్నాయి.

లైంగిక సంబంధాలకు మద్యం, మందుల ప్రలోభం

బాధితులు వెల్లడించిన వివరాల ప్రకారం, డాక్టర్ కాల్రా తన వద్దకు వచ్చే మాదకద్రవ్యాలపై ఆధారపడిన మహిళలకు మందుల ప్రిస్క్రిప్షన్‌లకు బదులుగా లైంగిక సంబంధాలను కోరారు. ఒక మహిళ అయితే తనను వైద్య పరీక్షల పేరుతో బలవంతంగా అనల్ సె*క్స్‌కు గురిచేసినట్లు తెలిపారు.

మెడికల్ లైసెన్స్ సస్పెన్షన్, క్లినిక్ మూసివేత

ప్రస్తుతం డాక్టర్ కాల్రా మెడికల్ లైసెన్స్‌ను సస్పెండ్ చేశారు. ఆయన క్లినిక్‌ను మూసివేయాలని కోర్టు ఆదేశించింది. కేసు విచారణ జరుగుతున్నంత వరకూ ఆయనకు మందులు రాయడంపై నిషేధం విధించారు. కోర్టులో హాజరైన అనంతరం $100,000 విలువైన బాండ్‌పై ఆయనను హోం అరెస్టులో ఉంచారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ, ఎస్సెక్స్ కౌంటీ జైలులో ఉన్న ఖైదీకి కూడా డాక్టర్ కాల్రా మందుల ప్రిస్క్రిప్షన్‌లు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.

మెడికెయిడ్ మోసంజజ కేవలం రికార్డుల కోసం నకిలీ కౌన్సెల్టేషన్‌లు

డాక్టర్ కాల్రా న్యూజెర్సీ మెడికెయిడ్‌కు మోసం చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కౌన్సెల్టేషన్‌లు జరగకపోయినా, వాటిని జరిగినట్లు రికార్డులు తయారు చేసినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా, పలువురు రోగులకు ఒకే విధంగా ఉండే ప్రోగ్రెస్ నోట్లు వ్రాశారు. వాటిలో అత్యవసర వివరాలు గానీ, వైరల్ సైన్స్‌లు గానీ నమోదు చేయలేదని ఫెడరల్ అధికారులు తెలిపారు.

ఎంత శిక్ష పడవచ్చు?

అవకాశాలన్నింటినీ కోల్పోయిన డాక్టర్ కాల్రా, ప్రతి డ్రగ్ పంపిణీ కేసుకూ గరిష్టంగా 20 ఏళ్ల జైలు శిక్షను ఎదుర్కొనాల్సి ఉంటుంది. అలాగే ఆరోగ్య మోసం కేసుకు గరిష్టంగా 10 ఏళ్ల శిక్ష పడొచ్చు. ఒక్కో డ్రగ్ కేసుకు $1 మిలియన్ వరకు, ఫ్రాడ్ కేసుకు $250,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.

ప్రజల విశ్వాసాన్ని అపవిత్రం చేసిన వైద్య వృత్తి

ఈ ఘటనపై ఫెడరల్ అధికారులతో పాటు న్యూజెర్సీ అధికార ప్రతినిధులు తీవ్రంగా స్పందించారు. “వైద్యులు ప్రజల విశ్వాసాన్ని పొందే వ్యక్తులు. కానీ డాక్టర్ కాల్రా దాన్ని తన లైంగిక తృప్తికోసం వాడుకున్నారు. ఇది మానవత్వానికి వ్యతిరేకం ” అని వ్యాఖ్యానించారు. ఈ ఘటన అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు గట్టి షాక్‌గా మారింది. వైద్య వృత్తిపై ఉన్న గౌరవాన్ని కలుషితం చేసేలా ఈ ఆరోపణలు ఉన్నాయి. పూర్తిస్థాయిలో విచారణ జరిగి న్యాయం జరగాలని ప్రజలు కోరుతున్నారు.

Tags:    

Similar News