తెలంగాణ వక్ఫ్ బోర్డుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం.. ఏం జరిగింది?
తెలంగాణ వక్ఫ్ బోర్డుపై నాలుగు సంవత్సరాల కిందట పలువురు కోర్టును ఆశ్రయించారు.;
కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుతో ఉడికిపోతున్న ముస్లిం వర్గాలకు.. తెలంగాణ హైకోర్టు రూపంలో మరో పిడుగు పడింది. తాజాగా గత తీర్పును అమలు చేయనందుకు.. ఆగ్ర హం వ్యక్తం చేసిన హైకోర్టు.. వక్ఫ్ బోర్డుపై సీరియస్ అయింది. ``దివ్య ఖురాన్ స్ఫూర్తిని మీరు విస్మరించా రు`` అని న్యాయమూర్తి నిప్పులు చెరిగారు. ఖురాన్ స్ఫూర్తిని మరిచిపోతున్నారని.. ఇలాగేనా.. వక్ఫ్ ను నడుపుకోవాల్సింది.. అని ప్రశ్నలు సంధించారు. ఈ సందర్భంగా.. ఖురాన్‌లోని పలు వాక్యాలను ఆయన కోర్టు లోనే చదివి వినిపించారు.
అసలు ఏం జరిగింది?
తెలంగాణ వక్ఫ్ బోర్డుపై నాలుగు సంవత్సరాల కిందట పలువురు కోర్టును ఆశ్రయించారు. తమ భూములను ఆక్రమించిన వక్ఫ్ బోర్డు.. తమదేనని వాదిస్తోందని.. తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. అంతేకాదు.. ఆక్రమిత స్థలంలో `ఇబాదత్ ఖానా` పేరిట నిర్మాణం కూడాజరిగిపోయిందని వివరించారు. దీనివెనుక ప్రభుత్వం కూడా(అప్పటి బీఆర్ ఎస్) ఉందని పిటిషనర్లు వాదించారు. దీనిపై విచారణ జరిగిన అప్పటి ధర్మాసనం.. తక్షణమే.. ఇబాదత్ ఖానాను స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించింది.
అదేసమయంలో ఎలాంటి వివాదాలకు తావులేకుండా.. వక్ఫ్ బోర్డు కూడా.. సదరు ఇబాదత్ ఖానాను ఇచ్చే యాలని.. అవసరమైతే.. ఓ కమిటీ వేసి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అయితే.. ఏళ్లు గడిచినప్ప టికీ.. ఇప్పటి వరకు.. వక్ఫ్ బోర్డు నిర్ణయం తీసుకోలేదు. దీనిపై పిటిషనర్లు మరోసారి కోర్టు గుమ్మం ఎక్కారు. తాజాగా ఈ కేసును విచారించిన న్యాయమూర్తి జస్టిస్ నగేష్.. వక్ఫ్ తీరుపై నిప్పులు చెరిగారు. ఒకసారి తీర్పు ఇచ్చిన తర్వాత అమలు చేయకుండా.. నిర్లక్ష్యం చేయమని ఖురాన్‌లో చెప్పారా? ప్రజల భూములు ఆక్రమించమని ఏ ఖురాన్‌లో రాసి ఉంది? అని నిలదీశారు.
ఈ క్రమంలోనే పేదల పక్షాన వక్ఫ్ బోర్డు పనిచేయడం లేదని న్యాయమూర్తి పెదవి విరిచారు. ``పేదలకు సాధ్యమైనంత వరకు సాయం చేయండి`` అని ఉన్న ఖురాన్‌లోని పంక్తులను చదివి వినిపించిన ఆయన.. ఇలా మీరు చేస్తున్నారా? అని వక్ఫ్ బోర్డును ప్రశ్నించారు. అయితే.. ఇలా ఖురాన్ లోని పంక్తులను చదవేసమయంలో న్యాయమూర్తి తన బూట్లను.. విప్పి చదవడం గమనార్హం. కాగా.. దీనిపై అఫిడవిట్ వేస్తామన్న వక్ఫ్ తరఫు న్యాయవాది అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్నారు.