• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Legal >  ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్...

ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి సుప్రీంలో షాక్

| లిక్కర్ స్కాంలో కీలక నిందితులు రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, మాజీ సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.

By - Tupaki Desk
Update: 2025-05-16 08:40 GMT

లిక్కర్ స్కాంలో కీలక నిందితులు రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, మాజీ సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ కోసం వారు పెట్టుకున్న పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ దశలో కల్పించుకుని నిందితులకు బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తుపై ప్రభావం చూపుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. హైకోర్టులో ముందస్తు బెయిల్ కు నిరాకరించడంతో నిందితులు ఇద్దరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ ప్రతికూల తీర్పు రావడంతో సిట్ తీసుకుబోయే చర్యలు ఆసక్తి రేపుతున్నాయి.

ముందస్తు బెయిల్ నిరాయకరించడంతో మద్యం స్కాంలో నిందితులైన రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, మాజీ సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుకు సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లైంది. ప్రస్తుతం నిందితులను సిట్ విచారిస్తోంది. అరెస్టు భయంతో సిట్ విచారణకు తొలుత డుమ్మా కొట్టిన నిందితులు.. ముందస్తు బెయిల్ విచారణ సమయంలో సుప్రీంకోర్టు రక్షణ కల్పించడంతో సిట్ ఎదుటకు వచ్చిన విషయం తెలిసిందే. గత రెండు రోజులుగా నిందితులను విచారించిన సిట్ అధికారులు, శుక్రవారం కూడా విచారణకు రమ్మని పిలిచారు.

ఇలాంటి సమయంలో వారి ముందస్తు బెయిల్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో ఇప్పుడేం జరగనుందనేది ఉత్కంఠ రేపుతోంది. ఈ రోజు విచారణలోనే ఏ31 ధనుంజయరెడ్డి, ఏ32 క్రిష్ణమోహన్ రెడ్డిని అరెస్టు చేస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో విచారణకు రమ్మని పిలిస్తే ఆ ఇద్దరూ పరార్ అవ్వడంతో ఇప్పుడు వదిలిపెట్టి, వారు తప్పించుకునే అవకాశాలు కల్పించరని అంటున్నారు. న్యాయస్థానాలు కూడా సిట్ చర్యలను సమర్థించేలా తీర్పునివ్వడంతో నిందితుల అరెస్టుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

పిటిషనర్లకు వ్యతిరేకంగా అన్ని సాక్ష్యాలు ఉన్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడంతో అరెస్టు నుంచి నిందితులు తప్పించుకోలేరని అంటున్నారు. ముందస్తు బెయిల్ ఇస్తే విచారణాధికారి చేతులు కట్టేసినట్లు అవుతుందని సుప్రీంకోర్టు పేర్కొనడమే కాకుండా, రెగ్యులర్ బెయిల్ కు దరఖాస్తు చేసుకోవాలని సూచించడంతో నిందితుల అరెస్టుకు పరోక్ష సంకేతాలిచ్చినట్లేనని అంటున్నారు. సుప్రీం తీర్పుతో సిట్ నిందితులను అరెస్టు చేస్తే ఈ కేసు మరో లెవెల్ కు చేరుకున్నట్లే అంటున్నారు.

Tags:    
  • LiquorScam 
  • SupremeCourt 
  • JaganOSD 
  • IASDhanunjaya 
  • AndhraPolitics 
  • PoliticalCorruption 
  • JaganReddy 
  • CorruptionCase 
  • IASArrest 

Similar News

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

చంద్రబాబు మీద కేసులు.... సీబీఐకి అప్పగించాలి !

2026-11-06 03:47 GMT

పొగ‌డ్త‌లే కాదు.. విమ‌ర్శ‌లనూ త‌ట్టుకోవాలి నాయ‌కా: హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

2026-11-03 22:30 GMT

మియాపూర్‌లో రూ. వేల కోట్ల భూములకు రక్షణ.. 23 ఏళ్ల పోరాటానికి సుప్రీంకోర్టు తెర!

2026-10-30 04:01 GMT

సుప్రీంకోర్టు అదిలిస్తే తప్ప క్యాన్సర్ మందుల ధరలు తగ్గించరన్న మాట.. భారీగా తగ్గిన ధరలు

2026-10-29 06:35 GMT

11 వేల ఇంజెక్షన్ లక్షా 30 వేలా...కేంద్రాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు !

2026-10-28 03:36 GMT

19 మున్సిపల్ ఎన్నికలపై సందిగ్ధం.. సుప్రీం ఆదేశాలతో ఎస్ఈసీ తర్జనభర్జన!

2026-10-21 14:54 GMT

ఇంతకీ మీరెవరు....సీజేపీకి న్యాయమూర్తి సూటి ప్రశ్న

2026-10-21 14:28 GMT

మీరు జెన్ జెడ్ లే కాదు: ఢిల్లీ హైకోర్టు

2026-10-21 12:46 GMT

నామినేషన్ల పొడిగింపుపై రేపటిలోగా నిర్ణయం తీసుకోండి: సుప్రీంకోర్టు

2026-10-21 07:11 GMT

భారత్ లో విదేశీయులు నిరసనల్లో పాల్గొనకూడదా? చట్టం ఏం చెబుతోంది?

2026-10-19 10:33 GMT

Copyright @2026

Powered by Blink CMS