• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Legal >  అతడు నిర్దోషి.. ఏపీ యువతి...

అతడు నిర్దోషి.. ఏపీ యువతి హత్య కేసులో సుప్రీం సంచలన తీర్పు

| దాదాపు పదేళ్ల క్రితం ఏపీకి చెందిన ఒక యువతి ముంబయికి వెళ్లటం.. ట్రైన్ దిగి తన హాస్టల్ కు వెళ్లే క్రమంలో దారుణంగా హత్యకు గురి కావటం అప్పట్లో పెను సంచలనంగా మారింది.

By - Tupaki Desk
Update: 2025-01-29 05:39 GMT

దాదాపు పదేళ్ల క్రితం ఏపీకి చెందిన ఒక యువతి ముంబయికి వెళ్లటం.. ట్రైన్ దిగి తన హాస్టల్ కు వెళ్లే క్రమంలో దారుణంగా హత్యకు గురి కావటం అప్పట్లో పెను సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన కేసులో తాజాగా సుప్రీంకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. నిందితుడ్ని నిర్దోషిగా పేర్కొన్న వైనం సంచలనంగా మారింది. ఈ హత్య ఉదంతం అప్పట్లో దేశ వ్యాప్తంగా ఈ దారుణ హత్య మీద చర్చ జరిగింది.

2014 జనవరి నాలుగున మచిలీపట్నానికి చెందిన ఏస్తేర్ అనూహ్య విజయవాడలోని లోక్ మాన్య తిలక్ టెర్మినస్ రైలులో బయలుదేరి వెళ్లింది. 2014 జనవరి 16న ముంబయిలోని కుంజూర్ మార్గ్ వద్ద శవమైన కనిపించింది. ఎస్తేర్ ను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి.. ఆ తర్వాత హత్య చేసినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో నిందితుడిగా ముంబయికి చెందిన చంద్రభానును పోలీసులు గుర్తించారు.అతడికి 2015లో మహిళా కోర్టు ఉరిశిక్ష విధించింది.

అనంతరం ఈ కేసు అప్పీలులో భాగంగా హైకోర్టు సైతం సమర్థించింది. ఈ తీర్పులను సవాలు చేస్తూ చంద్రభాను సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తాజాగా ఈ కేసును జస్టిస్ గవాయ్ తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా చంద్రభానే ఈ హత్యకు పాల్పడినట్లుగా ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయింది.

ఇదే విషయాన్ని ప్రస్తావించిన అత్యున్నత న్యాయస్తానం నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అతడ్ని నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పును ఇచ్చింది. దీనిపై విస్మయం వ్యక్తమవుతోంది. పోలీసుల తీరుతోనే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏమైనా..ఇలాంటి సంచలన హత్య కేసుల విషయంలో పోలీసులు మరింత యాక్టివ్ గా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    
  • SupremeCourtVerdict 
  • BrutalMurderCase 
  • Justice 
  • CourtRuling 
  • InnocentVerdict 
  • PoliceInvestigation 
  • MurderCase 
  • Chandrabhanu 
  • EstherCase 
  • SupremeCourt 

Similar News

మియాపూర్‌లో రూ. వేల కోట్ల భూములకు రక్షణ.. 23 ఏళ్ల పోరాటానికి సుప్రీంకోర్టు తెర!

2026-10-30 04:01 GMT

సుప్రీంకోర్టు అదిలిస్తే తప్ప క్యాన్సర్ మందుల ధరలు తగ్గించరన్న మాట.. భారీగా తగ్గిన ధరలు

2026-10-29 06:35 GMT

11 వేల ఇంజెక్షన్ లక్షా 30 వేలా...కేంద్రాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు !

2026-10-28 03:36 GMT

19 మున్సిపల్ ఎన్నికలపై సందిగ్ధం.. సుప్రీం ఆదేశాలతో ఎస్ఈసీ తర్జనభర్జన!

2026-10-21 14:54 GMT

ఇంతకీ మీరెవరు....సీజేపీకి న్యాయమూర్తి సూటి ప్రశ్న

2026-10-21 14:28 GMT

మీరు జెన్ జెడ్ లే కాదు: ఢిల్లీ హైకోర్టు

2026-10-21 12:46 GMT

నామినేషన్ల పొడిగింపుపై రేపటిలోగా నిర్ణయం తీసుకోండి: సుప్రీంకోర్టు

2026-10-21 07:11 GMT

భారత్ లో విదేశీయులు నిరసనల్లో పాల్గొనకూడదా? చట్టం ఏం చెబుతోంది?

2026-10-19 10:33 GMT

సేఫ్టీ పేరుతో పిల్లల ఇంటర్నెట్‌పై ఆంక్షలు వద్దు: సుప్రీంకోర్టు

2026-10-17 15:30 GMT

భ‌ర్త‌ను హ‌త‌మార్చిన భార్య‌ల‌కు ఉరిశిక్ష‌లు.. మీరట్‌లో వ‌రుస‌ సంచ‌ల‌న తీర్పుల‌పై చ‌ర్చ‌!

2026-10-16 14:13 GMT

జర్నలిజంపై సరికొత్త చర్చ.. ఆసక్తి రేపిన సుప్రీం వ్యాఖ్యలు!

2026-10-16 11:30 GMT

ఉద్యోగం పేరుతో యుద్దంలో చిక్కి !

2026-10-14 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS