• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Legal >  ఏపీ హైకోర్టు ప్రశ్న: పవన్...

ఏపీ హైకోర్టు ప్రశ్న: పవన్ కల్యాణ్ కేసు ప్రత్యేక కోర్టు ఎందుకు?

| వారాహి యాత్ర సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2025-04-02 04:00 GMT

వారాహి యాత్ర సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. వాలంటీర్లు సేకరిస్తున్న సమాచారం అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్లటం మహిళల అపహరణకు కారణమవుతోందన్న మాటలు పెను దుమారానికి కారణమైన సంగతి తెలిసిందే. దీనిపై అప్పటి వైసీపీ ప్రభుత్వం పవన్ కల్యాణ్ మీద క్రిమినల్ కేసును దాఖలు చేసింది. ఈ సందర్భంగా సదరు అంశంపై ఐదుగురు వాలంటీర్లు అఫిడవిట్లు ఇచ్చారు. ఇదిలా ఉంటే.. ఈ క్రిమినల్ కేసుకు సంబంధించిన అఫిడవిట్లు ఇచ్చిన వాలంటీర్లు.. వైసీపీ నేతలు తమ నుంచి సంతకాలు తీసుకొని కోర్టులో పిటిషన్ వేశారని పేర్కొన్నారు.

దీంతో.. పవన్ కల్యాణ్ పై ప్రాసిక్యూషన్ ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుంటూరు కోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి గత ఏడాది నవంబరు 18న ప్రాసిక్యూషన్ ఉపసంహరణకు ఉత్తర్వు జారీ చేశారు. ఇదే సమయంలో ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కె.సరళ మరో ముగ్గురు హైకోర్టులో క్రిమినల్ రివిజన్ కేసు దాఖలు చేశారు. దీనిపై తాజాగా విచారణ జరిగింది.

ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ప్రజాప్రతినిధి కాబట్టి.. ఈ కేసును ప్రజాప్రతినిదుల కేసుల్ని విచారించే ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని కోరారు. దీనికి స్పందించిన న్యాయమూర్తి.. ఈ కేసు నమోదు అయ్యే నాటికి పవన్ కల్యాణ్ ప్రజాప్రతినిధి కాదు కదా? అన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. ‘అలాంటప్పుడు కేసు విచారణను ప్రజాప్రతినిధుల కోర్టుకు పంపాల్సిన అవసరం ఏముంది?’ అని ప్రశ్నించారు. అదే సమయంలో ఈ సందేహంపై వాదనలు వినిపించాలంటూ న్యాయవాదుల్ని కోరుతో విచారణను వాయిదా వేశారు. దీంతో.. ఈ కేసులో ఏం జరుగుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    
  • PawanKalyan 
  • JanaSena 
  • VarahiYatra 
  • AndhraPradesh 
  • LegalBattle 
  • HighCourt 
  • PoliticalNews 
  • VolunteerCase 
  • TDP 
  • YSRCP 
  • APhighcourt 

Similar News

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

చంద్రబాబు మీద కేసులు.... సీబీఐకి అప్పగించాలి !

2026-11-06 03:47 GMT

పొగ‌డ్త‌లే కాదు.. విమ‌ర్శ‌లనూ త‌ట్టుకోవాలి నాయ‌కా: హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

2026-11-03 22:30 GMT

మియాపూర్‌లో రూ. వేల కోట్ల భూములకు రక్షణ.. 23 ఏళ్ల పోరాటానికి సుప్రీంకోర్టు తెర!

2026-10-30 04:01 GMT

సుప్రీంకోర్టు అదిలిస్తే తప్ప క్యాన్సర్ మందుల ధరలు తగ్గించరన్న మాట.. భారీగా తగ్గిన ధరలు

2026-10-29 06:35 GMT

11 వేల ఇంజెక్షన్ లక్షా 30 వేలా...కేంద్రాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు !

2026-10-28 03:36 GMT

19 మున్సిపల్ ఎన్నికలపై సందిగ్ధం.. సుప్రీం ఆదేశాలతో ఎస్ఈసీ తర్జనభర్జన!

2026-10-21 14:54 GMT

ఇంతకీ మీరెవరు....సీజేపీకి న్యాయమూర్తి సూటి ప్రశ్న

2026-10-21 14:28 GMT

మీరు జెన్ జెడ్ లే కాదు: ఢిల్లీ హైకోర్టు

2026-10-21 12:46 GMT

నామినేషన్ల పొడిగింపుపై రేపటిలోగా నిర్ణయం తీసుకోండి: సుప్రీంకోర్టు

2026-10-21 07:11 GMT

భారత్ లో విదేశీయులు నిరసనల్లో పాల్గొనకూడదా? చట్టం ఏం చెబుతోంది?

2026-10-19 10:33 GMT

Copyright @2026

Powered by Blink CMS