• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Legal >  బాధ్యత లేదు, కోరిక లేదని ...

బాధ్యత లేదు, కోరిక లేదని భర్తపై ఫిర్యాదు... హైకోర్టు కీలక తీర్పు!

| అవును... తన భర్త తనతో శారీరక సంబంధాలు లేదా పిల్లలను కలిగి ఉండటానికి ఆసక్తి చూపడం లేదని భార్య ఆరోపించింది.

By - Tupaki Desk
Update: 2025-04-01 07:30 GMT

తన భర్త కొన్ని మూఢ నమ్మకాల కారణంగా తనతో శారీరక సంబంధాలు కలిగి ఉండటం లేదని.. పిల్లలను కలిగి ఉండటానికి ఆసక్తి చూపించడం లేదని ఆరోపిస్తూ.. ఇలా అటు బాధ్యత, ఇటు కోరిక లేని భర్త నుంచి తనకు విడాకులు ఇప్పించాలని కేరళ హైకోర్టును ఆశ్రయించింది. ఈ సమయంలో హైకోర్టు ధర్మాసనం కీలక తీర్పు వెల్లడించింది.

అవును... తన భర్త తనతో శారీరక సంబంధాలు లేదా పిల్లలను కలిగి ఉండటానికి ఆసక్తి చూపడం లేదని భార్య ఆరోపించింది. దీంతో.. ఆమెకు విడాకులు మంజూరు చేస్తూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును కేరళ హైకోర్టు సమర్థించింది. ఈ మేరకు జస్టిస్ దేవన్ రామచంద్రన్, జస్టిస్ ఎంబి స్నేహలతలతో కూడిన బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది.

ఇందులో భాగంగా... కుటుంబ జీవితంపై భర్తకు ఆసక్తి లేకపోవడం అతన్ని వైవాహిక విధులను నిర్వర్తించడంలో వైఫల్యాన్ని సూచిస్తుందని డివిజన్ బెంచ్ పేర్కొంది. ఈ సందర్భంగా గతంలో భార్య దాఖలు చేసిన పిటిషన్ పై ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన విడాకుల మంజూరు తీర్పును సమర్థించింది.

వాస్తవానికి గతంలో ఫ్యామిలీ కోర్టు ఈ దంపతులకు విడాకులు మంజూరు చేయగా.. భర్త ఆ కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే... తన భర్త సె*క్స్ కు దూరంగా ఉండటమే కాకుండా.. పీజీ కోర్సులో చేరడానికి నిరాకరించాడని, మూఢనమ్మకాలు ఆధారంగా జీవితం గడపాలని బలవంతం చేస్తున్నాడని ఆరోపించింది.

ఇదే సమయంలో తన భర్త తరచూ తీర్థయాత్రలకు వెళ్తాడని.. ఆ సమయంలో తనను ఒంటరిగానే వదిలేస్తున్నాడని కూడా ఆమె తన పిటిషన్ లో ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ కోర్టు వారికి విడాకులు మంజూరు చేయగా.. ఆ తీరుపును హైకోర్టు సమర్థించింది!

Tags:    
  • KeralaHighCourt 
  • DivorceCase 
  • MaritalRights 
  • LegalUpdate 
  • FamilyLaw 
  • Women'sRights 
  • RelationshipMatters 
  • CourtVerdict 
  • JusticeServed 

Similar News

కోర్టు నిర్ధోషి అని తేల్చేసినా 7ఏళ్లు జైల్లోనే మ‌గ్గాడు.. ఈ న‌ర‌కానికి ప‌రిహారం 30ల‌క్ష‌లు!

2026-11-17 04:07 GMT

సెకండ్స్‌లో డ‌మ్మీ ఐఫోన్ అమ్మిన షాప్‌కి వినియోగ‌దారుల క‌మిష‌న్ ఝ‌ల‌క్!

2026-11-16 04:22 GMT

కోర్టు షాక్‌లు: మైన‌ర్ నేర‌స్తుల వ‌యోప‌రిమితి 18 నుంచి 16 ఏళ్ల‌కు త‌గ్గించాలి!

2026-11-15 07:32 GMT

పవన్ విడాకులు.. అసలు చట్టం ఏం చెబుతోంది!

2026-11-10 12:51 GMT

అరెస్ట్ అయితే చాలు.. ఇక 'ఉద్యోగానికి' సెలవు.. సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పుతో అవినీతి తిమింగలాలకు వణుకు

2026-11-10 06:00 GMT

ఓబీసీ క్రీమీలేయ‌ర్‌.. మ‌రింత క‌ఠిన‌మా? సుప్రీంకోర్టు ఏం చెప్పింది!

2026-11-07 13:45 GMT

భర్త మహాశయులారా? భార్యకు భరణం ఎగ్గొట్టే ప్లాన్ చేయకండి.. ఇలా బుక్కవుతారు..

2026-11-07 02:19 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

చంద్రబాబు మీద కేసులు.... సీబీఐకి అప్పగించాలి !

2026-11-06 03:47 GMT

పొగ‌డ్త‌లే కాదు.. విమ‌ర్శ‌లనూ త‌ట్టుకోవాలి నాయ‌కా: హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

2026-11-03 22:30 GMT

మియాపూర్‌లో రూ. వేల కోట్ల భూములకు రక్షణ.. 23 ఏళ్ల పోరాటానికి సుప్రీంకోర్టు తెర!

2026-10-30 04:01 GMT

Copyright @2026

Powered by Blink CMS