• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Legal >  కోర్టు సమయాన్ని వృధా...

కోర్టు సమయాన్ని వృధా చేస్తారా? దిమ్మ తిరిగే శిక్ష విధించిన ఢిల్లీ హైకోర్టు

| కోర్టు సమయాన్ని వృధా చేస్తున్న ఇద్దరు నిందితులకు..ఢిల్లీ హైకోర్టు దిమ్మ తిరిగేలాంటి శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

By - Tupaki Desk
Update: 2025-07-18 09:30 GMT

రెండు చేతులు పైకెత్తి నిటారుగా ఎంతసేపు నిలబడతారు? అంటే.. ఎవరైనా పది నిమిషాలు.. లేదంటే మరో ఐదు నిమిషాలు కలుపుకొని పావుగంటగా చెబుతారు. విన్నంతనే ఇదేం పెద్ద టాస్కు అనుకుంటారు కానీ.. దాన్ని మొదలుపెడితేనే.. అదెంత కష్టమైన పనో అర్థమవుతంది. కోర్టు సమయాన్ని వృధా చేస్తున్న ఇద్దరు నిందితులకు..ఢిల్లీ హైకోర్టు దిమ్మ తిరిగేలాంటి శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇంతకు వీరికి విధించిన వినూత్న శిక్ష మరేదో కాదు.. రెండు చేతులెత్తి నిటారుగా నిలబడటం.. అందుకు ఇచ్చిన టైంతోనే చిక్కంతా. ఎందుకుంటే కోర్టులో ఒక రోజు మొత్తం అలానే నిలబడాలని ఆదేశించటంతో.. నిందితులకు నోట మాట రాని పరిస్థితి.

2018కి సంబంధించిన ఒక కేసు తుది విచారణ ఢిల్లీ హైకోర్టులో జరుగుతోంది. ఇందులో నలుగురు నిందితుల్ని బెయిల్ బాండ్లు సమర్పించాలని చెప్పింది. కానీ.. వారు ఆ పని చేయలేదు. ఉదయం 10 గంటల నుంచి 11.40 గంటల మధ్య వరకు వెయిట్ చేసి.. రెండుసార్లు పిలిచిన తర్వాత కూడా నిందితులు బెయిల్ బాండ్లను సమర్పించలేదు. దీంతో కోర్టు విలువైన సమయాన్ని వృధా చేస్తున్న వైనంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఐపీసీ 228వ సెక్షన్ కింద నిందితులు కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు కోర్టు సమయం ముగిసే వరకు చేతులను నిటారుగా పైకెత్తి నిలబడాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో ఆరుగురు నిందితులు కాగా.. ఇప్పటికే ఇద్దరు మరణించారు. మిగిలిన నలుగురు (కుల్దీప్.. రాకేశ్.. ఉపాసన.. ఆనంద్) మాత్రమే మిగిలారు. వీరి తీరుకు వినూత్న శిక్ష విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.అయితే.. ఈ నలుగురిలో కుల్దీప్ మాత్రం 12.48 గంటల ప్రాంతంలో బెయిల్ బాండ్.. దరఖాస్తును కోర్టుకు సమర్పించారు. దీంతో వాటిని స్వీకరించి కోర్టు అతడ్ని కోర్టు కస్టడీ నుంచి విడుదల చేసేందుకు న్యాయమూర్తి అనుమతించారు. ఈ వ్యవహారం ఢిల్లీ కోర్టులో అందరి నోట నానేలా చేసింది.కోర్టు సమయాన్ని వృధా చేసే వారికి ఇదో హెచ్చరికగా చెబుతున్నారు.

Tags:    
  • DelhiHighCourt 
  • CourtTimeWasted 
  • UniquePunishment 
  • JudicialDiscipline 
  • IPC228 
  • LegalNews 
  • UnusualVerdict 
  • CourtroomOrder 
  • BailBondDelay 
  • హైకోర్టు 

Similar News

కోర్టు నిర్ధోషి అని తేల్చేసినా 7ఏళ్లు జైల్లోనే మ‌గ్గాడు.. ఈ న‌ర‌కానికి ప‌రిహారం 30ల‌క్ష‌లు!

2026-11-17 04:07 GMT

సెకండ్స్‌లో డ‌మ్మీ ఐఫోన్ అమ్మిన షాప్‌కి వినియోగ‌దారుల క‌మిష‌న్ ఝ‌ల‌క్!

2026-11-16 04:22 GMT

కోర్టు షాక్‌లు: మైన‌ర్ నేర‌స్తుల వ‌యోప‌రిమితి 18 నుంచి 16 ఏళ్ల‌కు త‌గ్గించాలి!

2026-11-15 07:32 GMT

పవన్ విడాకులు.. అసలు చట్టం ఏం చెబుతోంది!

2026-11-10 12:51 GMT

అరెస్ట్ అయితే చాలు.. ఇక 'ఉద్యోగానికి' సెలవు.. సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పుతో అవినీతి తిమింగలాలకు వణుకు

2026-11-10 06:00 GMT

ఓబీసీ క్రీమీలేయ‌ర్‌.. మ‌రింత క‌ఠిన‌మా? సుప్రీంకోర్టు ఏం చెప్పింది!

2026-11-07 13:45 GMT

భర్త మహాశయులారా? భార్యకు భరణం ఎగ్గొట్టే ప్లాన్ చేయకండి.. ఇలా బుక్కవుతారు..

2026-11-07 02:19 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

చంద్రబాబు మీద కేసులు.... సీబీఐకి అప్పగించాలి !

2026-11-06 03:47 GMT

పొగ‌డ్త‌లే కాదు.. విమ‌ర్శ‌లనూ త‌ట్టుకోవాలి నాయ‌కా: హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

2026-11-03 22:30 GMT

మియాపూర్‌లో రూ. వేల కోట్ల భూములకు రక్షణ.. 23 ఏళ్ల పోరాటానికి సుప్రీంకోర్టు తెర!

2026-10-30 04:01 GMT

Copyright @2026

Powered by Blink CMS