హైదరాబాద్ ఫ్లైట్ లో ఎమర్జెన్సీ డోర్ తీస్తూ ఆగమాగం చేసిన జిమ్ ట్రైనర్

ఇటీవల కాలంలో విమాన ప్రయాణాలకు సంబంధించిన అనూహ్య ఘటనలు.. పరిణామాల గురించి తరచూ వింటున్నాం.

Update: 2024-05-23 08:30 GMT

ఇటీవల కాలంలో విమాన ప్రయాణాలకు సంబంధించిన అనూహ్య ఘటనలు.. పరిణామాల గురించి తరచూ వింటున్నాం. ఇదిలా ఉంటే.. తాజాగా హైదరాబాద్ కు వచ్చే దేశీ విమానంలో హైదరాబాద్ మహానగరానికి చెందిన ఒక జిమ్ ట్రైనర్ వ్యవహరించిన తీరు షాకింగ్ గా మారింది. అంతేకాదు.. అతగాడి విపరీత చేష్టలతో విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులంతా హడలిపోయారు. ఫ్లైట్ డోర్ ను బలవంతంగా తీసే ప్రయత్నం చేయటం.. అతడ్ని ఆపేందుకు విమాన సిబ్బంది నానా ఇబ్బందులకు గురయ్యారు. షాకింగ్ గా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..

హైదరాబాద్ మహానగరంలోని గాజుల రామారానికి చెందిన 35 ఏళ్ల  జిమ్ ట్రైనర్ గా వ్యవహరిస్తుంటాడు. అతగాడు మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినికి వెళ్లాడు. తిరిగి హైదరాబాద్ వచ్చేందుకు ఫ్లైట్ తీసుకున్నాడు. విమాన ప్రయాణంలో తోటి ప్రయాణికులతో అనుచితంగా వ్యవహరించాడు. దీంతో ఎయిర్ లైన్స్ సిబ్బంది అతడ్ని మందలించారు. దీంతో ఆగ్రహానికి గురైన సదరు వ్యక్తి ఇష్టారాజ్యంగా వ్యవహరించటం మొదలుపెట్టారు.

అతడి సీటు నుంచి బయటకు తీసుకొచ్చి.. క్యాబిన్ ముందు సీట్లో కూర్చోబెట్టారు. తనను ఇలా చేస్తారా? అన్న అక్కసుతో విమానం తలుపును తీసే ప్రయత్నం చేశాడు. దీంతో.. విమానంలోని వారంతా హడలిపోయారు. ఫ్లైట్ డోర్ తీసే ప్రయత్నం చేస్తున్నజిమ్ ట్రైనర్ ను విమాన సిబ్బందితో పాటు.. ప్రయాణికులు కలిసి అడ్డుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే.. అతడ్ని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న వారు దర్యాప్తు చేపట్టారు. జిమ్ ట్రైనర్ అతితో విమానంలోని ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

Tags:    

Similar News