భేటీకి ముందే షాకిచ్చిన జెలెన్ స్కీ... ట్రంప్ ముందు బిగ్ టాస్క్!
ఇందులో భాగంగా.. తూర్పు ఉక్రెయిన్ లోని డాన్ బాస్ ప్రాంతంలోని డొనెట్స్స్, లుహాన్స్క్ ప్రాంతాలను ఉక్రెయిన్ వదులుకోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు.;
ఉక్రెయిన్ - రష్యా మధ్య శాంతి ఒప్పందం కోసం కొన్ని భూభాగాలు వెనక్కి తీసుకోవడం, మార్చుకోవడం జరుగుతుందని.. ఈ మార్పిడి ఇరుపక్షాలకు మేలు జరిగే విధంగానే ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పాట్ లోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ నుంచి స్పష్టమైన సమాధానం వచ్చేసింది.
ఇందులో భాగంగా... ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతను దెబ్బతీసే చర్చలను ఆమోదించబోమని.. శాంతి కోసం నిర్వహించే సమావేశాల్లో మా గళాన్ని వినిపించాల్సిందేనని మొదలుపెట్టి... ఆక్రమణదారులకు ఉదారంగా మా భూభాగాన్ని వదులుకోలేమని అన్నారు. ఇక, గత వారం అలాస్కాలో జరిగిన ట్రంప్ తో జరిగిన సమావేశంలో పుతిన్ నేరుగా తన కోరికను బయటపెట్టిన పరిస్థితి.
ఇందులో భాగంగా.. తూర్పు ఉక్రెయిన్ లోని డాన్ బాస్ ప్రాంతంలోని డొనెట్స్స్, లుహాన్స్క్ ప్రాంతాలను ఉక్రెయిన్ వదులుకోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా సోమవారం(18ఆగస్టు)న వైట్ హౌస్ లో జరగబోయే ట్రంప్ - జెలిన్ స్కీ మధ్య అత్యంత కీలక సమావేశం జరగనుంది. దీనికి ముందే జెలెన్ స్కీ నుంచి సమాధానం రావడం గమనార్హం.
అవును... పుతిన్ అడిగిన భూభాగం విషయంలో జెలెన్ స్కీ ని ట్రంప్ ఒప్పించడంపైనే రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధంపై ఒక క్లారిటీ రావొచ్చని అంటున్న వేళ.. మరోవైపు ఈ సమావేశం అటు ఉక్రెయిన్ భవిష్యత్తుతో పాటు ఇటు మొత్తం యూరప్ భద్రతకు మరింత కీలకమన్న అంచనాలున్నాయని చెబుతున్నారు. ఈ సమయంలో ఉక్రెయిన్ నుంచి సమాధానం వచ్చేసింది.
ఇందులో భాగంగా... రష్యాకు తమ భుభాగాన్ని ఇవ్వడం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదని జెలెన్స్కీ స్పష్టం చేశారు. ఇందుకు ఉక్రెయిన్ రాజ్యాంగం అనుమతించదని.. శాంతి ఒప్పందం కోసం ఎలాంటి భూభాగాలు మార్పిడి చేసుకునేది లేదని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ రోజు భేటీలో ట్రంప్ ముందు బిగ్ టాస్కే ఉందని అంటున్నారు విశ్లేషకులు.
జెలెన్ స్కీకి అండగా ఐరోపా నేతలు:
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని ఒంటరిగా పంపేందుకు ఐరోపా నేతలు ఇషటపడటం లేదని తెలుస్తోంది. ఫిబ్రవరిలో ట్రంప్ ను కలిసేందుకు అమెరికా వెళ్లిన జెలెన్ స్కీకి వైట్ హౌస్ లో చేదు అనుభవం ఎదురైన నేపథ్యంలో... ఈసారి జెలెన్ స్కీకి తోడుగా బ్రిటన్ ప్రధాని స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ తదితర యూరప్ నేతలూ అమెరికాకు వెళ్లనున్నారు!
కాగా నాడు ఆ భేటీలో... మూడో ప్రపంచయుద్ధం వచ్చేలా చేయొద్దంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడిపై ట్రంప్ విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలోనే యూరప్ నేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.