తమ్మినేని కే ఓటు వేసిన జగన్

ఇదిలా ఉంటే శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ గా తమ్మినేని సీతారాం ని జగన్ నియమించారు. ఈ మేరకు కేంద్ర కార్యాలయం నుంచి అదేశాలు వెలువడ్డాయి.;

Update: 2026-01-08 07:30 GMT

శ్రీకాకుళం జిల్లా వైసీపీ రాజకీయాల్లో వర్గ పోరు ఎపుడూ ఉన్నదే. దానికి సామాజిక సమీకరణలు రణం కూడా తోడు అయింది. కాళింగులు వర్సెస్ వెలమలు అన్న డివిజన్ ని తీసుకుని వచ్చారు. దాంతో వైసీపీ ఇరుకున పడుతోంది. పైగా వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న ధర్మాన కుటుంబం ఒక వైపు ఉంటే మరో వైపు కాళింగులు ఆత్మీయ సమావేశం పేరుతో ఇటీవల భారీ సదస్సు నిర్వహించారు. దానికి వైసీపీకి చెందిన సీనియర్ నేతం మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం హాజరయ్యారు. ఇంకో వైపు చూస్తే వైసీపీ నుంచి సస్పెండ్ అయిన దువ్వాడ శ్రీనివాస్ ధర్మాన సోదరుల మీద విమర్శలు చేయడంతో మరింతగా అగ్గి రాజుకుంటోనంది. ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.

పార్లమెంట్ బాధ్యతలు :

ఇదిలా ఉంటే శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ గా తమ్మినేని సీతారాం ని జగన్ నియమించారు. ఈ మేరకు కేంద్ర కార్యాలయం నుంచి అదేశాలు వెలువడ్డాయి. ఇప్పటిదాకా ఆయనే ఉన్నారు అని మరోసారి ఆయననే కొనసాగిస్తున్నట్లుగా గట్టి సంకేతాలు ఇచ్చారు. ఇలా ఎందుకు అంటే ఈ మధ్యనే తమ్మినేనిని రాజ్యసభకు పంపించి ఆ ప్లేస్ లో కొత్త వారికి యువ నేతకు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇస్తామని శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణ దాస్ చెప్పారు. అయితే ఆయన ప్రకటన తర్వాత ఎంతగా రాజకీయ రచ్చ జరిగిందో అందరికీ తెలిసిందే.

తొక్కేస్తున్నారు అంటూ :

ఒక బలమైన సామాజిక వర్గాన్ని తొక్కేసే ప్రయత్నం జరుగుతోంది అని దువ్వాడ శ్రీనివాస్ లాంటి వారు ఆ మీదట పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. దువ్వాడ శ్రీనివాస్ అయితే ఒక దశలో ధర్మాన కుటుంబం కింజరాపు కుటుంబం కలిసి రాజకీయాలు చేస్తున్నారు అని మండిపడ్డారు. దీని వల్ల బలమైన సామాజిక వర్గం అన్యాయం జరుగుతోంది అన్నారు. అయితే క్రిష్ణ దాస్ ఆ తరువాత వివరణ ఇచ్చారు. అలాంటిదేమీ లేదని అధినేత ఎవరికి ఎక్కడ పోటీ చేయించాలో నిర్ణయిస్తారు అని కూడా చెప్పారు. కానీ వైసీపీలో అయితే సామాజిక వర్గాల మధ్య చిచ్చుకు ఈ ప్రకటన కారణం అయింది.

తమ్మినేనికే అంటూ :

ఈ క్రమంలో తమ్మినేనిని శ్రీకాకుళం ఎంపీ సీటుకు బాధ్యుడిగా చేయడంతో వచ్చే ఎన్నికల్లో ఆయన ఎంపీగా పోటీ చేస్తారు అని అంటున్నారు. తమ్మినేని కూడా 2024 ఎన్నికల్లోనే తాను ఎంపీగా తన కుమారుడికి ఆముదాలవలస టికెట్ కోరుకున్నారు అని ప్రచారం సాగింది. అయితే ఇపుడు తమ్మినేనికి కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా వైసీపీ వ్యూహాత్మకంగానే వ్యవహరించింది అని అంటున్నారు. వివాదాలకు ఫుల్ స్టాప్ పెడుతూ జిల్లాలో వైసీపీ అంతా కలసి పనిచేయాలని సంకేతాలను కూడా పంపించింది అని అంటున్నారు. చూడాలి మరి ఇప్పటికైనా వైసీఎపీలో సామాజిక వర్గ పోరు తగ్గి అంతా ఒక్కటిగా పనిచేసి పార్టీని ఏ మేరకు బలోపేతం చేస్తారో.

Tags:    

Similar News