ఏపీలో అచ్చంగా మ‌హిళ‌ల కోసం '25 వేల కోట్లు'!

ముఖ్యంగా ఉమ్మ‌డి రాష్ట్రంలో మ‌హిళా సంఘాల‌ను సీఎం చంద్ర‌బాబు ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే.;

Update: 2026-01-09 03:54 GMT

ఏపీలో మ‌హిళ‌ల సంఖ్య పెరుగుతోంది. వాస్త‌వానికి దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లోనూ మ‌హిళ‌ల సంఖ్య పెరు గుతున్న‌ట్టు గ‌ణాంక శాఖ చెబుతోంది. ఈ నేప‌థ్యంలో మ‌హిళ‌ల స్వ‌యం ఉపాధి, ఉద్యోగ అవ‌కాశాల‌ను మెరుగు ప‌రిచేందుకు అటు కేంద్ర ప్ర‌భుత్వం ఇటు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు కూడా ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసు కుంటున్నాయి. ఈ క్ర‌మంలో ఏపీ ప్ర‌భుత్వం తాజాగా మ‌హిళ‌ల కోసం 25 వేల కోట్ల రూపాయ‌ల నిధిని ప్ర‌క‌టించింది.

ఈ నిధుల‌ను పూర్తిగా మ‌హిళా సాధికార‌త‌, వారి అభివృద్ధి, ఉపాధి కోసం వెచ్చించ‌నున్నారు. ఈ మొత్తం నుంచి మ‌హిళ‌లు రుణాలు తీసుకుని.. స్వ‌ల్ప వ‌డ్డీకే అబివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టేందుకు అవ‌కాశం ఉంటుంది. త‌ద్వారా.. ఆర్థికంగా వారు ఎదిగేందుకు ప్ర‌భుత్వం సాయం చేయ‌నుంది. గ‌రిష్ఠంగా మ‌హిళ‌ల కు ఒక్కొక్క‌రికీ రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణాల‌ను మంజూరు చేస్తారు. దీనికి ప్ర‌భుత్వ‌మే హామీ ఉండ‌నుంది. ఈ రుణాల‌ను కూడా.. ఆన్‌లైన్‌లోనే పొందే విధంగా ఏర్పాటు చేయ‌నున్నారు.

ముఖ్యంగా ఉమ్మ‌డి రాష్ట్రంలో మ‌హిళా సంఘాల‌ను సీఎం చంద్ర‌బాబు ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు వారికి మ‌రింత ద‌న్నుగా ఉండేందుకు.. వారికి ఆర్థిక సాయం చేసేందుకు రూ.25 వేల కోట్ల నిధిని ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా డ్వాక్రా సంఘాల‌ను మ‌రింత బ‌లోపేతం చేసేందుకు ఈ సంఘాల‌ను ప్ర‌తిగ్రామానికి.. వార్డుకు కూడా విస్త‌రించ‌నున్నారు. వారు చేసే ఉత్ప‌త్తుల‌ను ఇక నుంచి ప్ర‌భుత్వం ఆన్‌లైన్ మార్కెటింగ్ సౌకర్యం కల్పించ‌నుంది.

అదేవిధంగా నైపుణ్య శిక్ష‌ణ‌లో భాగంగా మ‌హిళ‌ల‌కు కార్పొరేట్ సంస్థలతో శిక్షణ ఇప్పించ‌నున్నారు. త‌ద్వారా.. వారికి మార్కెటింగ్ నైపుణ్యాలు నేర్పిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1.13 కోట్ల మంది మహిళా సంఘ సభ్యులు ఉన్నారు. వీరిలో కొద్దిగా చ‌దువుకున్న వారిని ఎంపిక చేసి.. వారికి.. నైపుణ్య శిక్ష‌ణ‌, మార్కెటింగ్ వంటి మెళ‌కువ‌లు నేర్పించ‌నున్నారు. త‌ద్వారా వారి వ్యాపారాన్ని వారే అభివృద్ధి చేసుకోవ‌డం, ఉత్ప‌త్తుల‌ను మార్కెటింగ్ చేసుకునే విధానాల‌ను నేర్పించ‌నున్నారు.

Tags:    

Similar News