వెనిజులాలో బంగారం ధర తెలిస్తే షాక్ తింటారు

ఇదిలా ఉంటే వెనిజులాలో పెద్ద ఎత్తున బంగారం నిల్వలు ఉండేవి. అయితే నికోలస్ మదురో హయాంలో భారీ ఎత్తున బంగారం నిల్వలను విదేశాలకు తరలించే ప్రక్రియ స్టార్ట్ అయింది.;

Update: 2026-01-09 03:53 GMT

వెనిజులా ఈ దేశం ఇపుడు ప్రపంచం నోట మారుమోగుతోంది. వారం క్రితం వరకూ పెద్దగా ఊసులో లేని ఈ దేశం ఇపుడు అంతర్జాతీయంగా ఎక్కడ చూసినా రీ సౌండ్ చేస్తోంది. దానికి కారణం అమెరికా పెద్దన్న డొనాల్డ్ ట్రంప్ వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మదురోని తమ సైన్యంతో నిర్బంధించి మరీ న్యూయార్క్ కోర్టు ఎదుట దోషిగా నిలబెట్టడమే. దాంతో వెనిజులా దేశం గురించి గూగుల్ సెర్చింగ్ మొదలైంది. ఆ దేశంలో అపార చమురు నిక్షేపాలు ఉన్నాయని అలాగే బంగారం నిల్వలు ఉన్నాయని పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారంతో నెటిజన్లలో ఆసక్తి పెరిగిపోతోంది మరి అన్ని వనరులు ఉన్న దేశంలో ఈ దరిద్రం ఏమిటి వలసలు ఏమిటి అన్నది కూడా నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

బంగారం బెంగతో :

భారత్ గత కొంత కాలంగా బంగారం బెంగతో ఉంది. అసలే బంగారం లేకపోతే దేశంలో ఏ పనీ జరగదు, సెంటిమెంట్ కూడా. పెళ్ళిళ్ళు అయినా శుభ కార్యాలు అయినా బంగారం ఉండాల్సిందే. అలాంటి బంగారం అమాంతం

ధర పెరిగిపోతూ బంగారం ప్రియులను హడలెత్తిస్తోంది. ఈ నేపధ్యంలో టన్నుల కొద్దీ బంగారం నిల్వలు వెనిజులాలో ఉన్నాయి అంటే భారత్ జనాల మొత్తం చూపు అంతా ఆ వైపునే ఉంది అని అంటున్నారు.

జస్ట్ అంతే సుమా :

భారత్ లో చూస్తే 24 క్యారెట్ బంగారం ధర గ్రాం 13,800 రూపాయలు పై చిలుకు ఉంది. అదే వెనిజులాలో చూస్తే గ్రాము భారత్ కరెన్సీ రేటులో కేవలం 181 రూపాయలు మాత్రమే. మారి ఇంత తేడాను చూస్తే వామ్మో అనుకోవాల్సిందే. బంగారం ప్రేమికులు అయితే షాక్ తినాల్సిందే. ఇక 22 క్యారెట్ బంగారం ధర భారత్ లో 11 వేల దాకా ఉంది. అదే వెనిజులాలో 166 రూపాయలకే లభిస్తోంది. అయితే ఈ ధరలు ఆ దేశ ఆర్ధిక పతనం వెనక విషాదానికి సూచికలుగా చెబుతున్నారు.

కరెన్సీ ఘోర పతనం :

వెనిజులా పాలకులు గత కొన్నేళ్ళుగా కరెన్సీ నోట్లను చిత్తు కాగితం ముక్కల మాదిరిగా ప్రింట్ చేసి జనంలోకి వదిలేస్తున్నారు. దాంతో వాటికి ఏ మాత్రం విలువ లేకుండా పోయింది. ఇక అక్కడ 2018 సమయానికే దారుణమైన ద్రవ్యోల్బనం ఉంది. అది కాస్తా 13 వేల శాతంగా పెరిగిపోయింది. దాంతో భారత్ కరెన్సీ రేటుకు అక్కడ కరెన్సీ ఏ మాత్రం సరితూగడం లేదు, వెనిజులన్ బోలివర్ అని పేరు కలిగిన ఆ దేశ కరెన్సీతో బంగారం రేటు అలా ఉంది అన్న మాట.

పెద్ద ఎత్తున విదేశాలకు :

ఇదిలా ఉంటే వెనిజులాలో పెద్ద ఎత్తున బంగారం నిల్వలు ఉండేవి. అయితే నికోలస్ మదురో హయాంలో భారీ ఎత్తున బంగారం నిల్వలను విదేశాలకు తరలించే ప్రక్రియ స్టార్ట్ అయింది. అలా 2013 నుంచి 2016 మధ్య కాలంలో సుమారు 113 మెట్రిక్ టన్నుల బంగారం వెనిజులా నుంచి స్విట్జర్లాండ్ కి పంపించినట్లుగా చెబుతున్నారు. ఇలా బంగారం తరలించడం ద్వారా వచ్చిన సొమ్ముని అప్పులు తీర్చడం కోసం అలాగే ఆర్ధికంగా ఏర్పడిన దారుణమైన సంక్షోభాన్ని ఎదుర్కోవడం కోసం ప్రభుత్వం వినియోగించింది అని చెబుతున్నారు. ఇక చూస్తే 2024 నాటికి వెనిజుల దేశంలో బంగారం కేవలం 161 టన్నులు మాత్రమే అని అధికార లెక్కలు చెబుతున్నాయి.

మొత్తం బంగారం టన్నులు :

ఇక వెనిజులా పరిస్థితి చూస్తే ఒకనాడు అత్యంత ధనిక దేశంగా ఉండేది ప్రపంచంలోని ముడి ఇంధన వనరులలో ఆ దేశం వాటా ఏకంగా 18 శాతంగా ఉంది అంటే ఆశ్చర్యపోవాల్సిందే. అంతే కాదు ఆ దేశంలోని ఒరినోకో మైనింగ్ ఆర్క్ ప్రాంతంలో ఏకంగా 8 వేల టన్నుల బంగారం నిల్వలు ఉండేవి. అలాగే వజ్రాలు వందల వేల టన్నుల్లో ఉండేవి. ఇక బాక్సైట్ ఖనిజాలు కూడా అత్యధికంగా ఉండేవి. పాలకుల దారుణాలు అవినీతి ప్రజలకు పంచిపెట్టేస్తూ ఉచిత పధకాలను విచ్చలవిడిగా చేయడం పని లేకుండా సోమరిపోతులను చేయడం వంటి కారణాల వల్ల వెనిజులా ఈ రోజు కటిక పేద దేశంగా మారింది. నూటికి ఎనభై శాతం మంది వలసలకు పోయారు అంటే బాధ కలుగుతుంది.

Tags:    

Similar News