పాల‌కొండా పాయే.. వైసీపీకి భారీ షాక్‌!

అయితే.. ఈ ప‌రిణామాల‌తో ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ.. వైసీపీ ప‌ట్టు కోల్పోతోంద‌న్న వాద‌న వినిపిస్తోంది.;

Update: 2025-04-28 17:02 GMT

ఏపీలోని ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ట్టున్న వైసీపీకి తాజాగా భారీ షాక్ త‌గిలింది. పాలకొండ నగరపంచాయితీ చైర్మన్ పీఠం కూట మి వసమైంది. 2వ వార్డు కౌన్సిలర్ ఆకుల మల్లేశ్వరి పాలకొండ నగర పంచాయితీ నూతన చైర్మన్ గా ఎన్నికయ్యారు. గతంలో 19వ వార్డు కౌన్సిలర్ ఎందవ రాధాకుమారి వైసీపీ హయాంలో చైర్మన్ పదవి పొందారు, అనంతరం వ్యక్తిగత కారణాలతో ఆమె రాజీనామాతో ఖాళీ అయిన చైర్మన్ పదవిలో తాత్కాలిక చైర్మన్ గా ఇన్నాళ్లు11వ వార్డు కౌన్సిలర్ పల్లా ప్రతాప్ కొనసాగారు. అనేక మార్లు చైర్మన్ ఎన్నిక ప్రక్రియ వాయిదాల తర్వాత నేడు పాలకొండ చైర్మన్ పీఠం కూటమి తన ఖాతాలో వేసుకుంది.

మంత్రి - ఎమ్మెల్యే చ‌క్రం!

మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ రాజకీయ చాణుక్యం ముందు వైసీపీ ఎత్తులు చిత్తు అయి పోయాయి. చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చిన తరుణంలోనే కూటమి ప్రభుత్వ అభివృద్ధిని చూసి ఆకుల మల్లేశ్వరి మంత్రి అచ్చెంనాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. సోమ‌వారం చైర్మ‌న్ స్థానానికి జరిగిన ఎన్నికలో ఆకుల మల్లేశ్వరి ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖ లు చేశారు. ఆమె అభ్యర్థిత్వాన్ని టీడీపీ కౌన్సిలర్లు అడపా జయ ప్రతిపాదించగా గంటా వరలక్ష్మి బలపరిచారు.

పాలకొండ నగరపంచాయితీ చైర్మన్ ఎస్సీ రిజర్వుడ్ స్థానం కావడంతో ఒకే అభ్యర్థి నామినేషన్ వేయడంతో ఎన్నికల అధికారి శోభిక.. ఆకుల మల్లేశ్వరిని చైర్మన్ గా ప్రకటించారు. కాగా.. కూట‌మి ఆశ‌యాల‌కు అనుగుణంగా ప‌నిచేసుకుంటామ‌ని మ‌ల్లేశ్వ‌రి చెప్ప‌డం గ‌మ‌నార్హం. దీంతో కీల‌క‌మైన పాల‌కొండ కూట‌మి కి ద‌క్కింది. అయితే.. ఏడాది పాటు మాత్ర‌మే ఈ పంచాయ‌తీ అధికారం ఉండ‌నుంది.

ప‌ట్టు పోతోందా?

అయితే.. ఈ ప‌రిణామాల‌తో ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ.. వైసీపీ ప‌ట్టు కోల్పోతోంద‌న్న వాద‌న వినిపిస్తోంది. వాస్త‌వానికి.. వైసీపీ నాయ‌కులు.. పాల‌కొండ‌లో లెక్క‌కు మిక్కిలిగానే ఉన్నారు. అయితే.. ఏ ఒక్క‌రూ ఈ వ్య‌వ‌హారంలో జోక్యం చేసుకోలేదు. బ‌య‌ట కు కూడా రాలేదు. దీంతో కూట‌మి పార్టీల ప్ర‌య‌త్నం సునాయాసంగా జ‌రిగిపోయింది. దీనిని బ‌ట్టి వైసీపీ ఇక ఎస్సీ స్థానాల్లోనూ ప‌ట్టు నిల‌బెట్టుకోలేక పోతోంద‌న్న చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి మున్ముందు ప‌రిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.

Tags:    

Similar News