వైసీపీ వార్నింగులు.. ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌ట్లేదా ..!

రాజ‌కీయాల్లో ఉన్న నాయ‌కులు విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌లు చేయ‌డం త‌ప్పుకాదు. కానీ, లెక్క పత్రం లే కుండా... చేసే విమ‌ర్శ‌ల‌ను ఎవ‌రూ హ‌ర్షించ‌రు.;

Update: 2025-08-16 10:29 GMT

రాజ‌కీయాల్లో ఉన్న నాయ‌కులు విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌లు చేయ‌డం త‌ప్పుకాదు. కానీ, లెక్క పత్రం లే కుండా... చేసే విమ‌ర్శ‌ల‌ను ఎవ‌రూ హ‌ర్షించ‌రు. పైగా.. బ‌ల‌మైన కూట‌మి ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేసే ముందు మ‌రింత ఆలోచించుకుని వ్య‌వ‌హ‌రించాలి. ఒక మాట అంటే.. నాలుగు మాట‌లు ఎదురు వ‌చ్చే ప‌రిస్థితి వైసీపీకి ఎదుర‌వుతోంది. ఈ విష‌యాన్ని నాయ‌కులు లైట్ తీసుకుంటున్నారో.. లేక‌.. ఏం జ‌రుగు తోందో తెలియ‌దు కానీ, వైసీపీ నేత‌లు చేస్తున్న విమ‌ర్శ‌లు గాలి వాటంగా ఉన్నాయ‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తు న్నాయి.

పులివెందుల‌, ఒంటిమిట్ట జ‌డ్పీటీసీ ఉప ఎన్నిక‌ల‌కు సంబంధించి మాజీ మంత్రి అంబ‌టి చేసిన వ్యాఖ్య లు బూమ‌రాంగ్ అయ్యాయి. ఎక్క‌డో వేరే రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌ల రిగ్గింగ్ దృశ్యాల‌ను ఇక్క‌డ జ‌రిగిన‌ట్టు గా ఆయ‌న పోస్టు చేయ‌డం.. వాటికి వ్యాఖ్యానాలు కూడా జోడించ‌డం.. పార్టీని అభాసుపాల్జేసింది. ఈ ప‌రి ణామాల‌పై పార్టీ అంత‌ర్మ‌థ‌నం చెందే ప‌రిస్థితి వ‌చ్చింది. కానీ.. అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయిం ది. ఈ ఒక్క‌టే కాదు.. ఉచిత బ‌స్సు ప్ర‌యాణం ప్రారంభించ‌కుండానే.. ఈ ప‌థ‌కం ఫెయిల్ అయిందంటూ .. వైసీపీ సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేశారు.

కానీ, సీఎం చంద్ర‌బాబు స్త్రీ శ‌క్తి ప‌థ‌కాన్ని ప్రారంభించిన త‌ర్వాత‌.. మ‌హిళ‌లు సంతోషం వ్య‌క్తం చేశారు. దీంతో వైసీపీ నేత‌లు అప్ప‌టి వ‌ర‌కు చేసిన విమ‌ర్శ‌లు గాలికి కొట్టుకుపోయాయి. నిజానికి ఏదైనా ప‌థ‌కంపై విమ‌ర్శ‌లు చేయాల‌ని అనుకున్న‌ప్పుడు ఖ‌చ్చిత‌మైన లెక్క‌లు వేసుకుని ముందుకు సాగాలి. ఆధారాల‌తో ముందుకు రావాలి. లేక‌పోతే.. ఏ పార్టీకైనా ఇబ్బందులు త‌ప్ప‌వు. అస‌లే వైసీపీపై ఇంకా ఇంకా వ్య‌తిరేక‌త ను పెంచే క్ర‌మంలో కూట‌మి ప్ర‌భుత్వం దూకుడుగా ముందుకుసాగుతోంది. 11 సీట్లే వ‌చ్చాయి క‌దా.. అని వైసీపీని వ‌దిలి పెట్ట‌డం లేదు.

ఈ నేప‌థ్యంలో వైసీపీ వేసే ప్ర‌తి అడుగూ కీల‌కంగా మారాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సీనియ‌ర్లు చెబుతున్నా రు. ఏదో మీడియా ముందుకువ చ్చి అన్నామంటే అన్నాం అన్న‌ట్టుగా విమ‌ర్శ‌లు చేస్తే.. ప్ర‌యోజ‌నం ఉండ‌క‌పోగా.. పార్టీకి మ‌రింత చేటు వ‌స్తుంద‌ని కూడా చెబుతున్నారు. పార్టీ అధినేత జ‌గ‌న్ సైతం.. ఎలాంటి ఆధారాలు లేకుండా చేస్తున్న విమ‌ర్శ‌ల‌ను ఈ సంద‌ర్భంగా ప‌లువురు గుర్తు చేస్తున్నారు. ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో ఇటీవ‌ల వ‌ర్షాలకు పొలాల్లోకి నీరు చేసింది. ఆ వెంట‌నే క‌లెక్ట‌ర్‌రైతుల‌కు ప‌రిహారం ఇచ్చేశారు. మ‌రి ఈవిష‌యం తెలిసో.. తెలియ‌కో జ‌గ‌న్ విమ‌ర్శ‌లు చేశారు. కానీ, అవి విఫ‌ల‌మ‌య్యాయి. ఇలా.. వైసీపీ చేస్తున్న ప‌నులు ఆ పార్టీకి ఎదురు తిరుగుతున్నాయ‌న్న చ‌ర్చ జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News