వైసీపీ కోటి సంతకాలు అట్టర్ ఫ్లాప్!.... 90 శాతం ఫేక్ సంతకాలు?
వైసీపీ గత పద్దెనిమిది నెలలుగా విపక్ష పాత్రను సమర్ధంగా పొషించడంలేదు అన్న భావన అయితే ప్రజలలో ఉంది.;
వైసీపీ గత పద్దెనిమిది నెలలుగా విపక్ష పాత్రను సమర్ధంగా పొషించడంలేదు అన్న భావన అయితే ప్రజలలో ఉంది. అంతే కాదు ప్రజా సమస్యల మీద వైసీపీ నేతలు ఎవరూ సరిగ్గా స్పందించదం లేదు అని విమర్శలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో వైసీపీ ఒక కీలక కార్యక్రమం తీసుకుంది. ఇది ప్రజలకు సంబంధించినదే. ఏపీలో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారు అని వైసీపీ అధినేత జగన్ టీడీపీ కూటమి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున యుద్ధానికి సిద్ధం అయ్యారు. వైసీపీ సైన్యం సాయంతో ఈ సమర భేరీని మోగించారు. అయితే వైసీపీ క్యాడర్ కానీ లీడర్ కానీ కో అంటే కోటి సంతకాల సేకరణలో ఎక్కడైనా కదిలిందా, ఇంతటి ప్రాముఖ్యత కలిగిన అంశలో వైసీపీ ఏ విధంగా ముందుకు సాగింది అంటే జవాబు చేదుగానే వస్తోంది.
జగన్ ఆగ్రహాన్ని :
ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేస్తున్నారు పెద్ద ఎత్తున పేద ప్రజలందరికీ వైద్య విద్యను దక్కకుండా చేస్తున్నారు అని జగన్ భావిస్తున్నారు. దీని వల్ల ఏపీలో పేదలకు చదువుతో పాటు వైద్యం కూడా అందకుండా పోతోంది అని ఆయన తలచారు. అందుకే ఒక భారీ పోరాటానికి ప్రణాళికను సిద్ధం చేశారు. ఇదిలా ఉంటే టీడీపీ వర్షన్ చూస్తే ప్రైవేట్ కళాశాలు అయితే తొందరగా ప్రజలకు అందుబాటులోకి వస్తాయి కదా దాని, అదే ప్రభుత్వం అయితే ఎలా చేయాలి అన్నది వారి వైపు నుంచి వాదనగా ఉంది. దీంతో వైసీపీ ఏకంగా ప్రజా పోరాటానికే సిద్ధం అయింది.
కోటి సంతకాలు అంటూ :
ఏపీలో అయిదు కోట్ల మంది ప్రజానీకం ఉంటే అందులో కోటి సంతకాలు అంటే ప్రతీ కుటుంబాన్ని ఈ పోరాటంలో భాగస్వామ్యం చేయడమే. ఒక విధంగా ఇది భారీ కసరత్తు. దీని వల్ల రెండు ప్రయోజనాలు వైసీపీ ఆశించింది ఒకటి ప్రభుత్వం తీసుకునే ప్రైవేట్ నిర్ణయం పట్ల ప్రజలలో చైతన్యం పెరుగుతుందని, ప్రభుత్వం మీద ఒత్తిడి ఉంటుందని, అదే సమయంలో తమ పార్టీ కూడా సంస్థాగతంగా మరింత చురుకుగా ముందుకు సాగుతుందని. అయితే వైసీపీ ప్లాన్ చేసినట్లుగా ప్రతీ నియోజకవర్గంలో ప్రభుత్వం జారీ చేసిన ప్రైవేటీకరణ జీవోకు వ్యతిరేకంగా ప్రజల నుంచి సంతకాలు భారీగా సేకరించాల్సి ఉంది. ఆ మీదట ఆ సంతకాలను అన్నీ కలిపి గవర్నర్ కి ఇవ్వాలని కూడా నిర్ణయించింది. ఇలా వైసీపీ ఒక భారీ ప్రోగ్రాం నే డిజైన్ చేసింది.
నియోజకవర్గంలో అలా :
ఇక చూస్తే కనుక కోటి సంతకాలు అంటే ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపుగా 60 వేల మంది సంతకాలు తీసుకోవాలి అన్న మాట. అలా లెక్క తీస్తే మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు కలుపుకుని కోటి సంతకాలుగా మారుతాయి. ఇక ఈ కార్యక్రమం ఆర్భాటంగా ప్రకటించినా కూడా మధ్యలో కొన్ని సార్లు వాయిదా పడింది. అలా చివరికి ఇపుడు అన్ని నియోజకవర్గాలలో హడావుడి చేసి చేసి మొత్తానికి కోటి సంతకాల కార్యక్రమం అయింది అనిపించారు. ఇక ఈ సంతకాల పత్రాలను విజయవాడకు తరలించే పనిలో అంతా ఉన్నారు ఇక ఈ కోటి సంతకాలను వైసీపీ అధినేత జగన్ గవర్నర్ కి ఇచ్చి ప్రజలంతా ప్రభుత్వం తీరు పట్ల మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీద యాంటీగా ఉన్నారని చెప్పాలన్నది ఉద్దేశ్యంగా ఉంది. ఇలా వైసీపీ ప్రోగ్రాం ఉంది.
ప్రజల భాగస్వామ్యం ఎంత :
ఇదిలా ఉంటే వైసీపీ తలపెట్టిన ఈ భారీ ప్రోగ్రాం లో ప్రజల భాగస్వామ్యం ఎంత అన్నదే ఇపుడు చర్చగా ఉంది. అయితే ఇక్కడే జగన్ పొరపడ్డారు అని అంటున్నారు. ఎందుకు అంటే ఇపుడు ప్రజలంతా అంతా ఇలాంట్ సంతకాలు చేయడానికి పోరాటాలకు ఏమంత చురుకుగా లేరు అని అంటునారు. వారికి కావాల్సింద్ సంక్షేమ పధకాలు. సూపర్ సిక్స్ అంటూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది అందువల్ల ఈ సంతకాలు పెడితే వైసీపీకి సహకరిస్తే తమ పధకాలు ఎక్కడ ఆగుతాయో అన్న భయాలు జనాలలో ఉన్నాయని అంటున్నారు. దాంతో ప్రజా భాగస్వామ్యం అన్నది కూడా ఈ విషయంలో ఎంత మేరకు ఉంది అంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు.
ఇంచార్జిలు యాక్టివ్ గా లేరు :
మరో వైపు చూస్తే మొత్తం ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో దాదాపుగా 140 దాకా నియోజకవర్గాలలో వైసీపీ ఇంచార్జిలు అయితే పెద్దగా యాక్టివ్ గా లేరు అని అంటున్నారు. ఎందుకంటే 2024 ఎన్నికల్లో చాలా నియోజకవర్గాలలో జగన్ రాజకీయ బదిలీల పేరుతో భారీగా షిఫ్ట్ చేశారు. దాంతో కొత్తగా ఇచ్చిన నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓటమి పాలు అయిన వారు అంతా తాము తిరిగి సొంత నియోజకవర్గాలకు వెళ్ళాలని చూస్తున్నారు. దాంతో వారు ప్రస్తుతం ఇంచార్జిలుగా ఉన్న చోట అయితే యాక్టివ్ గా పాలుపంచుకోవడం లేదని అంటున్నారు. ఈ విషయలో హైకమాండ్ ఎన్నిసార్లు చెప్పినా ఏ రకంగా ఆదేశించినా తూతూ మంత్రంగానే ఈ కార్యక్రమం చేశారు తప్ప వారిలో అయితే అసలైన ఉత్సాహం అయితే లేదని అంటున్నారు
వైసీపీ ఫోకస్ పెట్టాల్సిందే :
వైసీపీ ప్రభుత్వం ఏపీలో అధికారంలో ఉన్నపుడు ఎంతో చురుకుగా ఉన్న వారు ఇపుడు ఎందుకు ఈ విధంగా నిర్లిప్తంగా ఉన్నారు అన్నది వైసీపీ అధినాయకత్వం ఆలోచన చేయాలని అంటున్నారు. ఆనాడు పూర్తిగా పెత్తనం చేసిన వారు ఇపుడు అసలు సీన్ లోకి రావడం లేదంటే సీరియస్ గానే ఫోకస్ పెట్టాలని అంటున్నారు. ఇక చూస్తే కోటి సంతకాల సేకరణ అంటూ హైకమాండ్ ఒత్తిడి చేయడంతో ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఒకటి ఉందని అంటున్నారు. అదేంటి అంటే ఈ సంతకాల సేకరణ అంతా ఒరిజిలన్ కాదు అని ఓటర్ల జాబితా ముందేసుకుని క్యాడర్ నే సంతకాలు గీకి పారేశారు అని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోందిట. అంతే కాదు ఏకంగా తొంబై శాతం సంతకాలు ఫేక్ అని కూడా ప్రచారం సాగడం చిత్రంగా ఉంది అని అంటున్నారు.
బిల్డప్ ఇస్తూనే అలా :
ఇక డెడ్ లైన్ పెట్టేసి మరీ కోటి సంతకాలు అనడంతో ఆ భారీ లక్ష్యాన్ని సాధించడానికి కిందా మీద పడకుండానే కాగల కార్యాన్ని పూర్తి చేశారు అని అంటున్నారు. కొన్ని సంతకాలు మాత్రం జనం చేత పెట్టించి వాటిని పేపర్లో వేసుకుని బిల్డప్ ఇచ్చారు కానీ మెజారిటీ మాత్రం పేపర్లు క్యాడర్ చేతికి ఇచ్చి సంతకాలు పెట్టించుకోమని చెప్పి పంపేశారు అని అంటున్నారు. నాయకుల పురమాయింపుతో ఈ విధంగా చేతులూ కాళ్ళూ అన్నీ కలిపేసి మరీ సంతకాలు కెలికేసి కోటి అయిపోయింది అన్నట్లుగా క్యాడర్ ఫోజులు ఇచ్చారని పెద్ద ఎత్తున పార్టీలోనే విమర్శలు వినవస్తున్నాయి. ఇక్కడ మరో విషయం కూడా ఉందని అంటున్నారు. ఎమ్మెల్యేలుగా ఉన్న టైం లో నాయకులు పనిచేయలేదు, ఇపుడు క్యాడర్ కి పని అప్పగిస్తే వారు కూడా ఎందుకు పనిచేస్తారు అందుకే ఇంట్లో కూర్చుని సంతకాలు పెట్టేసి తెచ్చారు అని అంటున్నారు. మొత్తానికి వైసీపీ భారీ ఎత్తున చేపట్టిన కోటి సంతకాల సేకరణ వెనక చాలానే మతలబులు ఉన్నాయని ప్రచారం అయితే సాగుతోంది.