అవిశ్వాసం- వైసీపీ వైపే చూపు

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా మీద అవిశ్వాస తీర్మానాన్ని ఇండియా కూటమికి చెందిన పార్టీలు ఇచ్చాయి.;

Update: 2026-03-10 18:28 GMT

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా మీద అవిశ్వాస తీర్మానాన్ని ఇండియా కూటమికి చెందిన పార్టీలు ఇచ్చాయి. దీని మీద హాట్ గా డిస్కషన్ పార్లమెంట్ లో జరుగుతోంది. ఎన్డీయే వర్సెస్ ఇండియా కూటమిగా డైలాగ్ వార్ సాగుతోంది. అయితే లోక్ సభలో తటస్థ పార్టీలు ఉన్నాయి. అందులో వైసీపీ ఉంది. ఇక స్పీకర్ అవిశ్వాసం మీద ఓటింగ్ జరిగితే వైసీపీ ఏ వైపు అన్న ప్రశ్న తలెత్తుతోంది.

ఎన్డీయేకు మెజారిటీ :

ఇక లోక్ సభ లెక్కల ప్రకారం చూస్తే ఎన్డీయేకు ఏకంగా 293 మంది ఎంపీల మద్దతు ఉంది. అంటే మ్యాజికి ఫిగర్ కంటే ఇరవై మంది ఎక్కువగానే ఉన్నారు. అదే ఇండియా కూటమి బలం అంతా కలపి 240 ఎంపీలు ప్లస్ గా ఉంది కానీ అంత మంది కట్టకట్టుకుని వచ్చి ఓట్లు వేసిన కూడా భారీ తేడాతో ఈ తీర్మానం వీగిపోతోంది. మరి ఆ సంగతి తెలిసి ఎందుకు అవిశ్వాసం తీర్మానం నోటీసుని విపక్షాలు ఇచ్చాయి అంటే లోక్ సభ స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అన్నది చాటి చెప్పడానికి అని అంటున్నారు. అది ఒక వ్యూహంగా కూడా చెబుతున్నారు.

వైసీపీ ఏమి చేస్తుంది :

మామూలుగా అయితే ఎన్డీయేకు వైసీపీ లాంటి పార్టీల మద్దతు అవసరం లేదని అంటున్నారు. ఎందుకంటే సంఖ్యా బలం ఉంది. అదే రాజ్యసభలో అయితే అవసరం పడేదేమో అన్నది ఉంది. ఇక ఏపీలో చూస్తే జనసేన టీడీపీలతో బీజేపీ కూడి కూటమి ప్రభుత్వంలో కొనసాగుతోంది. కేంద్రంలో టీడీపీ ఎంపీలు మంత్రులుగా ఉన్నారు. ఇలా బలమైన బంధంతో ఎన్డీయే ఉంది. టీడీపీని జనసేనను ఏపీలో గట్టిగా వ్యతిరేకించే వైసీపీ ఎన్డీయేకు కేంద్రంలో ఈ విషయంలో మద్దతుగా నిలుస్తుందా అన్నది చర్చ.

రాజ్యాంగబద్ధంగా :

అయితే స్పీకర్ కానీ రాష్ట్రపతి ఉప రాష్ట్రపతి కానీ పోస్టులు అన్నీ రాజ్యాంగబద్ధమైనవి అని వైసీపీ ఎపుడూ చెబుతూ ఉంటుంది. వాటి విషయంలో రాజకీయాలు చేయడం తగదని ఏకాభిప్రాయం మేలు అని అంటూ ఉంటుంది. దాంతో ఈ విధంగా వైసీపీ ఆలోచనలు ఉంటాయి కనుక కచ్చితంగా స్పీకర్ మీద అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఎన్డీయేకు అనుకూలంగా ఓటు వేయవచ్చు అని అంటున్నారు. అదే జరిగితే ఏపీలో అన్ని పార్టీలకు చెందిన మొత్తం పాతిక మంది ఎంపీలు స్పీకర్ ఓమి బిర్లాకు సపోర్టు ఇచ్చినట్లే అవుతుంది. ఒక వేళ వైసీపీ అలా కాదు అనుకుంటే ఇండియా కూటమికి అనుకూలంగా అందులోనూ కాంగ్రెస్ కి ఫేవర్ గా తాము నిర్ణయం తీసుకోలేమని భావిస్తే వాకౌట్ చేయవచ్చు. లేదా తటస్థంగానూ ఉండిపోవచ్చు. కానీ వైసీపీ వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుందో అన్న చర్చ అయితే ఉంది. వైసీపీ తటస్థంగా ఉన్నా సభ నుంచి బయటకు వెళ్ళినా లేక అనుకూలంగా ఓటేసినా ఎన్డీయేకే అన్నీ అనుకూలం అవుతాయని అంటున్నారు. మరి ఇండియా కూటమికి మద్దతుగా ఓటేస్తేనే రాజకీయ ప్రకంపనలు మొదలవుతాయి. కానీ ఆ విధంగా వైసీపీ చేస్తుందా అన్నదే చర్చగా ఉంది. చూడాలి మరి.

Tags:    

Similar News