మోదీ 'విష్ణుమూర్తి'.. కాళ్లు కడిగి నీళ్లు తాగుతా!

మన దేశంలో దేవుళ్లకు.. నాయకులకు కొదవే లేదు. అయితే ఆ రెండింటినీ కలిపి ఒకే ఫ్రేమ్‌లో పెట్టి చూసే ‘అతి భక్తి’ ప్రహసనాలు తరచూ చూస్తూనే ఉంటాం.

Update: 2026-07-31 05:38 GMT

మన దేశంలో దేవుళ్లకు.. నాయకులకు కొదవే లేదు. అయితే ఆ రెండింటినీ కలిపి ఒకే ఫ్రేమ్‌లో పెట్టి చూసే ‘అతి భక్తి’ ప్రహసనాలు తరచూ చూస్తూనే ఉంటాం. కానీ బాలీవుడ్ సీనియర్ నటుడు సుదేశ్ బెర్రీ ప్రదర్శించిన అభిమానం మాత్రం సామాన్యమైనది కాదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోదీపై ఆయన కురిపించిన ‘భక్తి రస వర్షం’ చూసి నెటిజన్లు ఒక్కసారిగా దండం పెట్టేశారు. “ప్రధాని మోదీ సాక్షాత్తు ఆ లార్డ్ విష్ణువు అవతారమే.. నాకు గనుక అవకాశం దొరికితే ఆయన కాళ్లు కడిగి ఆ నీళ్లను ఆప్యాయంగా తాగేస్తాను” అంటూ బెర్రీ గారు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ టాపిక్‌గా మారింది.

ఆధ్యాత్మిక రాజకీయాలు.. అంతులేని ఆరాధన..

సాధారణంగా నటులు రాజకీయ నాయకులను పొగడటం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఈ రేంజ్ ఆధ్యాత్మిక పొగడ్తలు బహుశా ఈమధ్య కాలంలో ఎవరూ విని ఉండరు. “కనిపించని దేవుడిని గుడిలో ఎలా పూజిస్తానో కళ్లముందు తిరిగే మోదీని కూడా అలాగే ఆరాధిస్తాను. ఆయన దేశం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. అలాంటి మహానుభావుడిపై నాకు అపారమైన గౌరవం ఉంది” అని బెర్రీ చాలా భావోద్వేగంగా చెప్పుకొచ్చారు. ఈ మాటలు విన్న విమర్శకులు మాత్రం "అన్నా.. రాజకీయ నాయకులను నాయకులుగా చూడండి ఇలా దేవుళ్లను చేసేస్తే ఎలా?" అని తలలు పట్టుకుంటున్నారు.

సీజేపీ అంటే కాక్రోచ్ జనతా పార్టీ అట!

ఇక మోదీ భక్తితో సరిపెట్టుకుంటే ఆయన సుదేశ్ బెర్రీ ఎందుకవుతారు? విమర్శకులపై కూడా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. మోదీ ప్రభుత్వాన్ని, ఆయన నిర్ణయాలను విమర్శించే వారిని ఉద్దేశించి సీజేపీ అంటూ ఒక కొత్త నామకరణం కూడా చేశారు. "దేశాన్ని ముందడుగు వేయించడానికి మోదీ కష్టపడుతుంటే వీళ్లు మాత్రం కాళ్లు పట్టుకుని వెనక్కి లాగుతున్నారు. ఇలాంటి వాళ్లు పనికిరాని వాళ్లు బొద్దింకలతో సమానం" అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బెర్రీ గారి ఈ 'క్రియేటివిటీ' చూసి పొలిటికల్ విశ్లేషకులు సైతం నోరెళ్లబెడుతున్నారు.

సోషల్ మీడియాలో భక్తులు వర్సెస్ ట్రోలర్లు!

ప్రస్తుతం ఈ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దాంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి ఆడుకుంటున్నారు. ఒక భారతీయుడి మనసులోని నిస్వార్థమైన అభిమానం ఇదీ.. సీనియర్ నటుడు కరెక్ట్‌గా చెప్పారు." అని లైక్‌ల వర్షం కురిపిస్తున్నారు. "నెక్స్ట్ సినిమాలో మంచి క్యారెక్టర్ రోల్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? లేక ఏకంగా రాజ్యసభ సీటుకే సైన్ చేశారా భయ్యా?" అంటూ సెటైర్లు వేస్తున్నారు.

భక్తి వెనుక ఏముంది?

సుదేశ్ బెర్రీ గతంలో కూడా జాతీయ అంశాలు, దేశభక్తి, రాజకీయాలపై ఇలాగే ఓపెన్‌గా మాట్లాడిన చరిత్ర ఉంది. కాకపోతే ఈసారి ఏకంగా "కాళ్లు కడిగి నీళ్లు తాగుతా" అనే లెవల్‌కి వెళ్లడమే రచ్చకి కారణమైంది. నాయకులను అభిమానించడం తప్పు కాదు కానీ ఇలా 'తీర్థం తీసుకుంటా' అనే రేంజ్ దాసరికాన్ని ప్రదర్శించడం వెనుక ఏదైనా రాజకీయాశయం ఉందా అని సొంత సినీ ఇండస్ట్రీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఏది ఏమైనా రాజకీయాల్లో నాయకులను ఆరాధించడం మన దేశంలో పాత ముచ్చటే అయినా.. సుదేశ్ బెర్రీ గారి ఈ 'విష్ణు అవతారం', 'కాక్రోచ్ జనతా పార్టీ' లాంటి కామెంట్లు మాత్రం పొలిటికల్ అండ్ కామెడీ వర్గాల్లో గట్టి నవ్వుల పువ్వులే పూయిస్తున్నాయి.. దీనిపై పొలిటికల్ పార్టీల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.



Tags:    

Similar News