చనిపోయిన మనిషికి ఊపిరిపోసిన 'గుంత'.. అసలేం జరిగిందంటే?

అలాంటిది ఒకవేళ మనిషి చనిపోయాక మళ్ళీ బ్రతికితే అదే ఒక అద్భుతం అంటే.. అలాంటిది చనిపోయిన మనిషికి ఒక గుంత ప్రాణం పోసిందంటే ఎవరైనా నమ్మగలరా?..

Update: 2026-07-31 04:37 GMT

మనిషి జీవితం ఎంత విలువైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. జీవితంలో ఏది పోయినా తిరిగి సంపాదించుకోగలం కానీ ప్రాణం పోయింది అంటే మళ్ళీ తిరిగి తెచ్చుకోలేం. అలాంటిది ఒకవేళ మనిషి చనిపోయాక మళ్ళీ బ్రతికితే అదే ఒక అద్భుతం అంటే.. అలాంటిది చనిపోయిన మనిషికి ఒక గుంత ప్రాణం పోసిందంటే ఎవరైనా నమ్మగలరా?..

సాధారణంగా రోడ్లపై గుంతలు మనుషుల ప్రాణాలు తీస్తాయి అంటారు. కానీ అదే గుంత ఒక మనిషికి ప్రాణం పోసిన ఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది..ఎన్నో వింతలలో ఇది ఒకటి అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. మరి కొంతమంది ప్రాణాలు తీసే గుంతలు ప్రాణాలు పోయడం ఏంటి? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. మరి అసలు ఏంటి ఈ గుంత కథ? ఎవరు చనిపోయారు? వారికి గుంత ఎలా ప్రాణం పోసింది? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

చనిపోయిన మనిషికి ప్రాణం పోసిన గుంత:

అసలు విషయంలోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ , ఏలూరు జిల్లా కైకలూరులో తాజాగా జరిగిన ఈ సంఘటన అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. భుజబల పట్నం మాజీ సర్పంచ్ రామ తులసి అనారోగ్యంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె వయసు 48 సంవత్సరాలు. కుటుంబ సభ్యురాలు మరణించడంతో శోకసంద్రంలో మునిగిపోయిన ఆమె కుటుంబం కన్నీటి పర్యంతం అవుతూ ఆమె మృతదేహాన్ని ఇంటికి తరలిస్తుండగా.. రోడ్లపై గుంతలు ఎక్కువగా ఉండడంతో అంబులెన్స్ గుంతలో పడి కుదుపులకు లోనయింది. అయితే వెంటనే ఆమె స్పృహలోకి రావడంతో.. తిరిగి ఆసుపత్రికి తరలించగా.. ఆమె ఆరోగ్యం మెరుగుపడింది. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు..

ప్రాణాలు తీసే గుంతలు ప్రాణం పోయడం ఏంటో..

ఇకపోతే ఈ ఘటన ఆ నోట ఈ నోట మీడియా కంట పడడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అసలు విషయం తెలిసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై గుంతలు ప్రాణాలు తీస్తుంటే.. ఒక గుంత ప్రాణం పోయడం ఏంటో విడ్డూరంగా ఉంది అంటూ కామెంట్లు చేయగా.. మరి కొంతమంది ఆమెకు భూమి మీద నూకలు ఉన్నాయి అందుకే ఆమె మళ్ళీ ప్రాణాలతో తిరిగి వచ్చింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా తమ ఇంటి మనిషి ఇక లేరు అనే చేదు వార్తను జీర్ణించుకోలేని ఆ కుటుంబ సభ్యులకు ఈ వార్త అత్యంత ఆనందకరం అని చెప్పాలి.

Tags:    

Similar News