వైసీపీ ఉత్తరాంధ్రా వ్యూహం ?
వైసీపీ అనూహ్యంగా మావిగన్ నినాదం అందుకుని విశాఖ రాజధానిని పక్కన పెట్టేసింది. దాంతో ఉత్తరాంధ్రా విషయంలో వైసీపీ మాట తప్పింది అన్న విమర్శలు ఉన్నాయి.
వైసీపీ అనూహ్యంగా మావిగన్ నినాదం అందుకుని విశాఖ రాజధానిని పక్కన పెట్టేసింది. దాంతో ఉత్తరాంధ్రా విషయంలో వైసీపీ మాట తప్పింది అన్న విమర్శలు ఉన్నాయి. వైసీపీ రాజధాని నినాదం క్లిక్ కాలేదని ఆ పార్టీ యూ టర్న్ తీసుకున్నా ఇది ఉత్తరాంధ్రా అభివృద్ధితో ముడిపడి ఉన్న వ్యవహారంగా కూడా చూస్తారు. రాజధాని సంగతి పక్కన పెడితే వైసీపీ పదే పదే విశాఖ రెడీ మేడ్ సిటీ అని ఉత్తరాంధ్రాను తాము అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పిన మాటలు ఇచ్చిన హామీల మీద కూడా ఇపుడు చర్చ సాగుతోంది. వీటితో పాటు ఉత్తరాంధ్రాలోని వైసీపీ నేతలు కూడా మావిగన్ ప్రకటన తరువాత కొంత సైలెంట్ అయినట్లుగా చెబుతున్నారు.
కూటమికి పట్టున్న చోట :
ఇక కూటమికి ఉత్తరాంధ్రాలో పట్టుంది. టీడీపీకే బలం ఉంది అనుకుంటే జనసేనకు కూడా సామాజిక వర్గాలు కొన్ని బలంగా ఉంటూ మద్దతు ఇస్తున్నాయి. విశాఖ సిటీ లాంటి చోట్ల బీజేపీకి బలం ఉంది. దాంతో ఉత్తరాంధ్రాలో 2024 ఎన్నికల్లో కూటమి అన్ని సీట్లూ గెలుచుకుంది. అది కూడా వైసీపీ విశాఖను రాజధాని చేస్తామని ఉత్తరాంధ్రాకి కొత్త వెలుగులు ఇస్తామని హామీలు ఇచ్చి జనంలో వాటిని విస్తృతంగా ప్రచారం చేసిన తరువాత కూడా ఈ తరహా రిజల్ట్ వచ్చింది. ఇపుడు విశాఖ రాజధాని అన్న దాని నుంచి వైసీపీ వెనక్కి వెళ్తే అది కూటమికి మరింతగా ఊతం ఇస్తుందని అంటున్నారు.
కొత్త ఆలోచనలతోనే :
ఈ క్రమంలోనే వైసీపీ సరికొత్త ఆలోచనలతోనే రంగంలోకి దిగాలని అంటున్నారు. వైసీపీ కూడా మావిగన్ పేరుతో తమకు 2024 లో దెబ్బేసిన కృష్ణా గుంటూరు జిల్లాలలో పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగమే మావిగన్ అన్న స్లోగన్ అని అంటున్నారు. అక్కడ టీడీపీకి బలం ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు మావిగన్ పేరుతో అభివృద్ధి చేస్తామని వైసీపీ ఇక మీదట గట్టిగా చెప్పనుంది. దాంతో పాటు ఉభయ గోదావరి జిల్లాలలో చూస్తే బలమైన కాపులను తిరిగి ఆకట్టుకోవాలని వైసీపీ చూస్తోంది. దానికి తగిన కార్యాచరణ వ్యూహాలు ఇప్పటికే సిద్ధమై కొన్ని ఆచరణలోకి అమలులోకి వచ్చేశాయి కూడా. అదే విధంగా గ్రేటర్ రాయలసీమలోని ఆరు జిల్లాలలో కడప, కర్నూలు, అనంతపురం చిత్తూరులలో సహజంగానే వైసీపీకి బలం ఉందని ఆ పార్టీ భావిస్తోంది. దాంతో నెల్లూరు, ఒంగోలులలో సరైన వ్యూహాలను రెడీ చేసుకునే పనిలో ఉంది అని అంటున్నారు.
ఆ రీజియన్ సంగతేంటి :
మరి ఇలా ఒక్కో రీజియన్ కి సబ్ రీజియన్ కి తగినట్లుగా తన వ్యూహాలను రెడీ చేసుకుంటున్న వైసీపీ ఉత్తరాంధ్రా విషయంలో కూడా కొత్త వ్యూహాలను అమలు చేయాలని చూస్తోంది అని అంటున్నారు. ఆ వ్యూహాల సంగతి ఏమిటి అన్నదే చర్చగా ఉంది. ఉత్తరాంధ్రాలో బీసీల జనాభా నూటికి ఎనభై శాతం ఉంది. వెనకబడిన ప్రాంతంగా పేరు ఉంది. దాంతో సామాజిక ప్రాంతీయ అజెండాలను వైసీపీ కూటమికి ధీటుగా సెట్ చేసుకుని ముందుకు రావాల్సి ఉంటుందని అంటున్నారు. ఎటూ మావిగన్ స్లోగన్ అంటే ఏపీ మొత్తానికి అది సెట్ కాదు కాబట్టి ఉత్తరాంధ్ర కు ఏ స్లోగన్ తో వస్తారు, ఏ వ్యూహాలను సిద్ధం చేస్తారు అన్నది వేచి చూడాల్సిందే మరి. సో ఇదన్న మాట ఫ్యాన్ పార్టీ కొత్త ప్లాన్.