షాకింగ్ రిపోర్ట్: ఒక దేశాధినేత అంత్యక్రియల్లో 3000 మంది చనిపోవడమా? శ‌వాల కోసం స‌మాధులు త‌వ్విపెట్టార‌ట‌!

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల ఏర్పాట్లు.. వాటి చుట్టూ జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి.

Update: 2026-07-05 02:09 GMT

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల ఏర్పాట్లు.. వాటి చుట్టూ జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ వారం రోజుల పాటు సాగే భారీ ఊరేగింపుల్లో విపరీతమైన జనసందోహాలు త‌ర‌లి వ‌స్తుండ‌టంతో అస‌లేం జ‌రుగుతుందోన‌నే ఆందోళ‌న నెల‌కొంది. కోట్లాదిమంది ప్ర‌వాహంలా దూసుకొస్తుండటంతో భారీ ఎత్తున తొక్కిసలాట జరిగి... వేలాది మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని వస్తున్న క‌థ‌నాలు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ఒక అంత్యక్రియల వేడుక కోసం ముందే వేలాది సమాధులను తవ్వి సిద్ధం చేయడం ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారింది.

జర్మన్ ప్రముఖ వార్తాపత్రిక `డై వెల్ట్` సంచలన నివేదిక ప్రకారం.. ఖమేనీ అంత్యక్రియల ఊరేగింపులకు దేశం నలుమూలల నుండి దాదాపు 1.5 కోట్ల నుండి 2 కోట్ల మంది వరకు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ విపరీతమైన రద్దీ.. ప్రస్తుతమున్న తీవ్రమైన ఎండల కారణంగా ఊహించని రీతిలో తొక్కిసలాట జరిగి ఏకంగా 1500 నుండి 3000 మంది వరకు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఇరాన్ రెడ్ క్రెసెంట్, నేషనల్ క్రైసిస్ మేనేజ్‌మెంట్ సంస్థలు అంతర్గతంగా ఒక క్లాసిఫైడ్ లెటర్ ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరించాయి.

ఈ షాకింగ్ అంచనాల నేపథ్యంలో.. టెహ్రాన్‌లోని పబ్లిక్ శ్మశానవాటిక `బెహెష్ట్-ఎ జహ్రా` లో అధికారులు ఇప్పటికే వేలాది కొత్త సమాధులను తవ్వి సిద్ధం చేసినట్లు మున్సిపల్ వర్గాల ద్వారా సమాచారం బయటకు వచ్చింది. 3000 మంది చనిపోయినా పర్వాలేదు.. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేయండి! అని పైస్థాయి నుండి ఆదేశాలు వచ్చినట్లు మున్సిపల్ ఉద్యోగులు పేర్కొనడం గమనార్హం. గతంలో 2020లో జరిగిన జనరల్ ఖాసీం సులేమానీ అంత్యక్రియల్లోనూ ఇలాగే తొక్కిసలాట జరిగి 56 మంది చనిపోయిన చేదు అనుభవం ఇరాన్‌కు ఉంది.

మరోవైపు.. శనివారం ఉదయం టెహ్రాన్‌లోని గ్రాండ్ మొసల్లా కాంప్లెక్స్‌లో ఖమేనీ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచడంతో అంత్యక్రియల షెడ్యూల్ అధికారికంగా ప్రారంభమైంది. ఈ వారం రోజుల కార్యక్రమం టెహ్రాన్ నుండి ప్రారంభమై సోమవారం నాటికి పవిత్ర నగరమైన `కోమ్` కు చేరుకుంటుంది. బుధవారం ఇరాన్ సరిహద్దులు దాటి ఇరాక్‌లోని కర్బలా, నజాఫ్ నగరాల్లో ఉన్న ఇమామ్ హుస్సేన్ దర్గా మీదుగా సాగి.. చివరకు గురువారం ఇరాన్ రెండో అతిపెద్ద నగరమైన మషద్‌లోని పవిత్ర `ఇమామ్ రెజా` క్షేత్రంలో ఖననంతో ముగుస్తుంది.

అయితే ఈ అంత్యక్రియల వెనుక తీవ్రమైన అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు నడుస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ పరిణామాలపై స్పందిస్తూ.. దాడుల వల్ల ఇరాన్ తీవ్రంగా దెబ్బతిందని.. తాము పెద్దమనసుతో అంత్యక్రియలు చేసుకోవడానికి ఇరాన్‌కు వారం రోజులు సమయం ఇచ్చామని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇరాన్ ప్రభుత్వం తన పడిపోతున్న ప్రతిష్టను కాపాడుకోవడానికి... దేశ సైనిక శక్తిని ప్రపంచానికి చాటిచెప్పడానికి దాదాపు 15 నుండి 20 మిలియన్ యూరోల భారీ బడ్జెట్‌తో ఈ అంత్యక్రియలను ఒక పెద్ద రాజకీయ, సైనిక ప్రదర్శన వేదికగా వాడుకుంటోందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags:    

Similar News