• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రామచంద్రాపురంలో బోసు...

రామచంద్రాపురంలో బోసు చిచ్చు ?

| తూర్పుగోదావరి జిల్లాలోని కీలకమైన నియోజకవర్గాల్లో రామచంద్రాపురం కూడా ఒకటి.

By - Tupaki Desk
Update: 2023-07-16 05:35 GMT

తూర్పుగోదావరి జిల్లాలోని కీలకమైన నియోజకవర్గాల్లో రామచంద్రాపురం కూడా ఒకటి. ఇక్కడ కీలకమైన నేత పిల్లి సుభాష్ చంద్రబోస్. బీసీల్లోని శెట్టి బలిజ సామాజికవర్గానికి చెందిన బోసు చాలా సీనియర్ అనే చెప్పాలి. అయితే సొంతంగా పోటీచేసి గెలిచేంత సీన్ బోసుకు ఎప్పుడూ లేదు. బోసుకు మొదటినుండి ఉన్నది ఏమిటంటే వైఎస్ కుటుంబంపై అభిమానమే. అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కు బలమైన మద్దతుదారుగా ఉండేవారు. ఇప్పుడు అంతేస్ధాయిలో జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారు. ఆ లాయల్టీయే బోసుకు పదవులను తెచ్చిపెడుతోంది.

ఇలాంటి బోసు ఇపుడు రాజ్యసభ ఎంపీ. 2019లో మండపేటలో పోటీచేసి ఓడిపోయారు. మొదటినుండి రామచంద్రాపురమే అయినా మొన్న మాత్రం సీట్ల సర్దుబాటు కుదరక మండపేట నుండి పోటీచేసి ఓడిపోయారు. ఓడిపోయినా మంత్రిని చేసి ఎంఎల్సీని చేశారు. వెంటనే రాజ్యసభ్య పదవిని ఇచ్చారు. జగన్ ఇంత ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ సొంత నియోజకవర్గం రామచంద్రాపురంలో చిచ్చుకు రెడీ అయిపోయారు. ఈమధ్యనే జరిగిన పార్టీ నేతల సమావేశంలో ఉభయగోదావరి జిల్లాల ఇన్చార్జి మిథున్ రెడ్డి మాట్లాడుతు చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణే రాబోయే ఎన్నికల్లో పోటీచేయబోతున్నట్లు ప్రకటించారు.

ఇది జరిగిన రెండు రోజులకే బోసు తన మద్దతుదారులతో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో బోసు రెండో కొడుకు సూర్యప్రకాష్ పోటీలోకి దిగబోతున్నట్లు మద్దతుదారులు ప్రకటించారు. దాంతో పార్టీలో అయోమయం మొదలైపోయింది. పోటీలోకి దిగబోయేది మంత్రి చెల్లుబోయినా లేకపోతే బోసు కొడుకు ప్రకాషా అన్నది అర్ధంకావటంలేదు.

మద్దతుదారులు ప్రకటించినట్లుగానే నియోజకవర్గంలో ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. తాజా పరిణామాల్లో తన కొడుక్కి బోసు టికెట్ సాధించుకుంటారా లేదా అన్నది ఆసక్తిగా మారిపోయింది. చెల్లుబోయినే పోటీచేస్తారని ఎంపీ ప్రకటించారంటే అది జగన్మోహన్ రెడ్డి అనుమతితోనే జరిగుంటుంది. మరి ఎంపీ ప్రకటించిన తర్వాత కూడా బోసు మద్దతుదారులతో సమావేశం పెట్టడం, వాళ్ళతోనే కొడుక్కి టికెట్ అని డిమాండ్ చేయించటం ఏమిటో అర్ధంకావటంలేదు. బోసు నియోజకవర్గంలోచిచ్చు పెడుతున్నారా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. మరి దీనికి బోసే సమాధానం చెప్పాలి.

Tags:    
  • YSRCPMP 
  • PilliSubhashChandraBose 
  • YSRCP 
  • Andhrapradesh 
  • PoliticalNews 

Similar News

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

నాన్న‌గారి ఆశ‌యాలు నెర‌వేరుస్తా: రాధా ఫ‌స్ట్ స్పీచ్‌

2026-11-04 13:00 GMT

నియంతలు ట్రంప్, నెతన్యాహు ఔట్ అట.. ‘సీజేపీ‘ నేతలు హ్యాపీ.. టార్గెట్ మోడీయేనా?

2026-11-04 12:57 GMT

ఓటువేయలేదుగా.. నా డబ్బులు నాకివ్వండి.. వైసీపీ అభ్యర్థి 'రివర్స్ వసూళ్లు' వైరల్

2026-11-04 11:17 GMT

భారతీయులతో పెట్టుకున్నాడు.. ట్రంప్ అనుభవిస్తున్నాడు..

2026-11-04 10:57 GMT

టికెట్ ధ‌ర‌ల‌పై CM విజ‌య్ ముందు చూపు మనవాళ్ల‌కు ఏదీ?

2026-11-04 09:39 GMT

ఏపీలో మ‌రో ఎన్నిక‌ల పోరు..!

2026-11-04 09:22 GMT

రాప్తాడు నిందితుడిపై కాల్పుల కేసులో కీలక పరిణామం

2026-11-04 09:14 GMT

ఎలా గెలవాలో చెప్పారు...జగన్ కంగ్రాట్స్ !

2026-11-04 09:06 GMT

Copyright @2026

Powered by Blink CMS