ఆ ఇద్దరు ఎమ్మెల్సీల మనసులో వైసీపీయేనట !
ఇక అనంత బాబు విషయానికి వస్తే ఆయన తన సొంత డ్రైవర్ హత్య కేసులోనే నిందితుడిగా కటకటాల వెనక్కి వెళ్తారని ఎవరూ ఎపుడూ అనుకోలేదు.;
ఆ ఇద్దరి ఎమ్మెల్సీల విషయంలో బయట ఎంతో రచ్చ రాజకీయంగా సాగినా విపక్షాలు అరచి ఘీ పెట్టిన తరువాత కానీ వైసీపీ అధినాయకత్వం ఆలోచించలేదు, చివరికి వారిని సస్పెండ్ చేసింది. ఈలోగానే భారీ మూల్యం కూడా చెల్లించాల్సింది చెల్లించేసింది. ఇంతకీ ఎవరా ఇద్దరు ఎమ్మెల్సీలు అంటే ఒకరు శ్రీకాకుళం జిల్లాకు చెందిన దువ్వాడ శ్రీనివాస్, మరొకరు అల్లూరి జిల్లాకు చెందిన రంపచోడవరం ఎమ్మెల్సీ అనంత బాబు. ఈ ఇద్దరూ సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యారు వారి మీదనే కొన్నాళ్ళ పాటు కంటెంట్ నడిచేలా చేసుకున్నారు.
డ్రైవర్ హత్య కేసులో :
ఇక అనంత బాబు విషయానికి వస్తే ఆయన తన సొంత డ్రైవర్ హత్య కేసులోనే నిందితుడిగా కటకటాల వెనక్కి వెళ్తారని ఎవరూ ఎపుడూ అనుకోలేదు. ఆయనకు రంపచోడవరం ప్రాంతంలో మంచి బలం ఉంది. సామాజికవర్గం పరంగా కూడా బలమైన నాయకుడు. అంతే కాదు ఆయన రాజకీయంగా తాను అనుకున్న వారినే ఎమ్మెల్యేలుగా గెలిపించుకుని ఆయనే అంతా పాలిస్తారు అని చెప్పుకుంటారు. అంతలా హవా ఉన్న నాయకుడు కావడం వల్లనే వైసీపీ ఆయనను ఎమ్మెల్సీగా చేసింది. అయితే ఆయన మీద వచ్చిన ఆరోపణలతో ఏకంగా వైసీపీ మొత్తం కదిలిపోవాల్సి వచ్చింది. డ్రైవర్ ని హత్య చేసి వారి ఇంటికే పార్సిల్ చేసి వచ్చాడన్నది అప్పట్లో ఏపీ అంతా వైరల్ అయింది. విపక్షాలు చేసిన ప్రచారంతో జనాలు కూడా వైసీపీ మీద చర్చించుకోవదం జరిగింది. అయితే ఇంత జరిగాక కానీ వైసీపీ యాక్షన్ లోకి దిగలేదు. మొత్తానికి ఆయనను సస్పెండ్ చేసింది. అయితే ఆయన ఎమ్మెల్సీగా మాత్రం కొనసాగుతూనే ఉన్నారు.
దువ్వాడ దూకుడు :
ఇక శ్రీకాకుళం జిల్లాలో చూస్తే ఏకంగా కింజరాపు కుటుంబం మీదనే దూకుడు చేసే నేతగా పేరున్న దువ్వాడ శ్రీనివాస్ వ్యక్తిగత జీవితంలో వివాదాలు చోటు చేసుకోవడం అది పూర్తిగా రచ్చ కావడంతో దాని మీద కూడా వైసీపీ ఆలస్యంగానే స్పందించింది అని విమర్శలు ఉన్నాయి. మొత్తానికి దువ్వాడను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే ఆయన కూడా ఎమ్మెల్సీగానే పదవిలో కొనసాగుతున్నారు. ఆయన సైతం జగన్ నా దేవుడు అని చెప్పుకుంటున్నారు. పార్టీలో ఎపుడైనా వచ్చేందుకు చూస్తున్నారు. అదే విధంగా అనంత బాబు కూడా వైసీపీలో అనధికారిక నేతగానే ఉంటున్నారు అని అంటున్నారు. వైసీపీ సైతం వారి విషయంలో ఏమీ బహిరంగంగా అనడం లేదు, మొత్తానికి చూస్తే ఈ ఇద్దరు నేతలూ వైసీపీ జపమే చేస్తున్న్నరు. కాల మాన పరిస్థితులు అనుకూలంగా మారినపుడు ఈ ఇద్దరూ తిరిగి వైసీపీలోకి వస్తారని బలంగా ఆయా చోట్ల ప్రచారం అయితే సాగుతోంది. మొత్తానికి దూరమైనా చేరువే అన్నట్లుగా ఈ ఇద్దరి ఎమ్మెల్సీల వ్యవహారం ఉందని అంటున్నారు.