• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కమ్యూనిస్టులతో వైసీపీ...

కమ్యూనిస్టులతో వైసీపీ కూటమి...ఏపీలో కొత్త రాజకీయం !

| 2029 ఎన్నికలే లక్ష్యంగా వైసీపీ కొత్త రాజకీయ వ్యూహానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ కూటమిని ఎదుర్కొనేందుకు సీపీఐ, సీపీఎంలతో కలిసి పనిచేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో వామపక్షాల సహకారం అందడంతో మూడు పార్టీలు కలిసి ఉద్యమాలు, రాజకీయ పోరాటాలు సాగిస్తే కూటమికి గట్టి పోటీ ఇవ్వవచ్చని వైసీపీ భావిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి.

By - Satya P
Update: 2026-11-22 04:30 GMT

ఏపీలో కొత్త రాజకీయానికి వైసీపీ శ్రీకారం చుట్టబోతోంది అని అంటున్నారు. ఇప్పటి దాకా సింహం సింగిల్ అన్న స్లోగన్ ని పక్కన పెట్టి అవకాశం ఉన్న చోట అంది వచ్చిన మిత్రులతో చేతులు కలపడం ద్వారా 2029 ఎన్నికల్లో టీడీపీ కూటమిని ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతోంది అని అంటున్నారు. ఈ క్రమంలో వైసీపీకి వామపక్షాలతో స్నేహ బంధం బలపడే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. దానికి నాందీ ప్రస్తావన తాజాగా ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగింది అని అంటున్నారు. ఈ ఎన్నికల్లో అనంతపురం మేయర్ పీఠం వైసీపీకి దక్కడానికి సీపీఐ నేతల ప్రచారం మద్దతు కూడా ఉంది. అలాగే చాలా చోట్ల రెండు పార్టీలు సహకరించుకున్నాయని చెబుతున్నారు. అలాగే సీపీఎం తో కూడా వైసీపీ చెలిమికి సిద్ధంగా ఉంది అని అంటున్నారు.

ప్రజలకు చేరేలా :

వామపక్ష నేతలు ఇటీవల తాడేపల్లిలోకి వైసీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్ళి జగన్ తో భేటీ వేశారు. ఏపీకి సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఈశ్వరయ్య వచ్చిన తరువాత వైసీపీతో చెలిమికి బాటలు పడ్డాయని కూడా చెబుతున్నారు. అలాగే సీపీఎం తో కూడా వైసీపీకి మొదటి నుంచి సానుకూల దృక్పథం ఉంది అని గుర్తు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ రెండు పార్టీలతో కలిసి నడిస్తే ఎలా ఉంటుంది అన్నది వైసీపీ సీరియస్ గానే ఆలోచన చేస్తోంది అని అంటున్నారు. మూడు పార్టీలు కలిస్తే టీడీపీ కూటమి వ్యతిరేక భావ జాలం ప్రజలకు మరింత బలంగా చేరుతుందని కూడా భావిస్తున్నారు.

గ్రౌండ్ లెవెల్ లో పోరు :

ఇక చూస్తే వైసీపీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక విషయం స్పష్టంగా అర్థం అయింది అని అంటున్నారు. ఎన్నికల్లో నామినేషన్ల నుంచి పోలింగ్ దాకా ఆపై కౌంటింగ్ దాకా కూడా అడుగడుగునా పోరాటం చేయాల్సిన పరిస్థితులు ఉంటాయని కూడా అర్ధం అయింది అని అంటున్నారు. వైసీపీ నేతలు కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్ లో పోరాడుతున్నారు. వారితో పాటుగా వామపక్ష నేతలు కూడా తోడుగా ఉంటే తమ పోరాటాలకు బలం వస్తుందని కూటమిని ధీటుగా ఎదుర్కొనేందుకు వీలు అవుతుందని వైసీపీ పెద్దలు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. అంతే కాకుండా ప్రతీ పల్లెల్లో ప్రతీ ప్రాంతంలో ఎర్ర జెండా ఉంటుంది, ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలను నడుపుతూ జనంలోకి వామపక్షాలు చొచ్చుకుని పోతారు. రాజకీయంగా మాత్రం వారికి ఆశించిన ఫలితాలు రావడం లేదు, అదే వైసీపీ లాంటి పార్టీలతో కలిస్తే ఉభయ కుశలోపరి గా ఉంటుందని కూడా ఆలోచిస్తున్నారు.

పొత్తు పేచీ ఉండదు :

అంతే కాదు వామపక్షాలు ఎపుడూ సీట్ల దగ్గర పేచీ పెట్టేది ఉండదు, వారికి కోరుకున్న చోట్ల సీట్లు కేటాయించడం కూడా పెద్ద సమస్య కాదు, కానీ వారికి ప్రతీ నియోజకవర్గంలో ఉండే సాంప్రదాయ ఓట్లు వేయి దాకా పొత్తు వల్ల వైసీపీకి అదనంగా కలిసే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు. అలాగే మూడు పార్టీలు కలిసి జనంలో ఉద్యమిస్తే ఆ సౌండే వేరేగా ఉంటుందని కూడా అంటున్నారు. అందుకే అన్నీ ఆలోచించిన మీదటనే వైసీపీ కమ్యూనిస్టులతో కలసి అడుగులు వేయాలని చూస్తోంది అని అంటున్నారు. చూడాలి మరి ఈ ఊహాగానాలు నిజం ఏ మేరకు అవుతాయో.

Tags:    
  • ysrcp 
  • ysjagan 
  • andhrapradeshpolitics 

Similar News

రూ.800 కోట్ల కలల సాకారం.. ఐఐటీ క్లాస్‌రూమ్ నుంచి మెటా సూపర్ ఇంటెలిజెన్స్ వరకు ఓ భారతీయుడి అద్భుత ప్రస్థానం

2026-11-22 04:34 GMT

పుష్క‌రాల‌కు మోడీ వ‌స్తున్నారు.. ఏర్పాట్లు అద‌రాలి: చంద్ర‌బాబు

2026-11-22 04:32 GMT

టెస్టు క్రికెట్‌లో టీమ్‌ఇండియా విధ్వంసం.. రికార్డులన్నీ బద్దలు.. పంత్‌ ఖాతాలో అరుదైన ఘనత

2026-11-22 04:32 GMT

ఆదీ.. వేరే రాజకీయ దారి ఏదీ ?

2026-11-22 04:31 GMT

గోవా కేరళ తరహాలో విశాఖ....కూటమి యాక్షన్ ప్లాన్ !

2026-11-22 04:30 GMT

స్టాలిన్ రిస్క్ చేస్తారా...ఊరిస్తున్న కొళత్తూరు

2026-11-22 04:16 GMT

అరకు కాఫీకి బ్రాండ్ ఇమేజ్ ..ఓటమిపై బాబు కామెంట్ !

2026-11-22 04:15 GMT

వైఎస్సార్ క్లోజ్ ఫ్రెండ్......జగన్ హిట్ అండ్ రన్ !

2026-11-22 00:22 GMT

జగన్ అంతకు మించి చేయలేరా ?

2026-11-22 00:21 GMT

వీడియో: లైవ్‌లో ప్ర‌ద‌ర్శ‌న కోసం నీతా అంబానీ భ‌ర‌త‌నాట్యం ప్రాక్టీస్

2026-11-22 00:20 GMT

బంగారం ధరలు తగ్గడానికి అదే కారణమా? మోదీ వ్యాఖ్యల వెనుక ఆసక్తికర కోణం

2026-11-22 00:19 GMT

Copyright @2026

Powered by Blink CMS